మారుతీ తో పక్కా కమర్షియల్ షూటింగ్ ముగించేసి రిలీజ్ డేట్ ఇచ్చేసిన గోపీచంద్.. తన తదుపరి మూవీని శ్రీవాస్ దర్శకత్వంలో మొదలు పెట్టేసాడు. శ్రీవాస్ - గోపీచంద్ కలయికలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ ప్రస్తుతం మైసూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అయితే అక్కడ మైసూర్ లో ఓ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న టైం లో హీరో గోపీచంద్ కాలుకు గాయాలైనట్టు గా తెలుస్తుంది. గోపీచంద్ కి షూటింగ్ స్పాట్ లో గాయాలయ్యాయి అంటూ వార్తలు రావడంతో ఆయన ఫాన్స్ లో ఆందోళన మొదలైంది.
అయితే గోపీచంద్ కి పెద్దగా గాయాలు అవలేదని, కాలుకు మాత్రం స్వల్ప గాయాలైనట్టు దర్శకుడు శ్రీవాస్ మీడియాకు తెలియజేసాడు. అలాగే గోపీచంద్‌కు పెద్దగా ప్రమాదం ఏం జరగలేదని, కొద్దిగా రెస్ట్ టీయూస్కునేట్ సరిపోతుంది అని, ఫాన్స్ కూడా ఆందోళన పడవద్దని ఆయన మీడియా ముఖంగా తెలియజేసారు.