సక్సెస్ ఫుల్ హీరోయిన్, స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ గ్లామర్ షో చేస్తూ టాప్ చైర్ కి దగ్గరైన పూజ హెగ్డే కి ఇప్పుడు మూడు వరస షాక్ లు తగిలాయి. మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ అంటూ టాలీవుడ్ ని ఏకధాటిగా దున్నేసిన పూజ హెగ్డే.. అటు తమిళ్ లోను స్టార్ హీరో విజయ్ తో రీ ఎంట్రీ ఇచ్చింది. అలాగే ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ తో క్రేజీ హీరోయిన్ గా మారింది. కానీ పూజ హెగ్డే కి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ భారీ షాక్ ఇచ్చింది. ఆ సినిమా వరల్డ్ వైడ్ గా నెగెటివ్ టాక్ తో ప్లాప్ లిస్ట్ లోకి వెళ్ళింది. తర్వాత కోలీవుడ్ లో పూజ హెగ్డే విజయ్ తో కలిసి నటించిన బీస్ట్ కూడా పూజ కి మరో షాక్ ఇచ్చింది.
ఆ సినిమాలో అరబిక్ కుతు సాంగ్ ఎంతగా పాపులర్ అయ్యిందో.. అంతగా బీస్ట్ డిసాస్టర్ అయ్యింది. ఆ సినిమా లో పూజ హేగ్డ్ ని చూసిన వారు ఇంత పెద్ద హీరోయిన్ కి ఈ రోల్ ఏమిటి అంటూ పెదవి విరిచారు. ఆ సినిమాలో పూజ హెగ్డే జస్ట్ స్మాల్ రోల్ అంటే గెస్ట్ కి ఎక్కువ, హీరోయిన్ కి తక్కువ అన్నట్టుగా అనిపించింది. ఇక మూడో షాక్ పూజ హెగ్డే కి ఆచార్య ఇచ్చింది. నీలాంబరిగా చూడడానికి అందంగా, ఆకర్షణగా కనిపించింది. కానీ ఆచార్యలో పూజ హెగ్డే రోల్ ఏం లేదు. పెరఫార్మెన్స్ కి అసలు స్కోప్ లేదు. అలాగే సినిమాకి కూడా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. సో పూజ హెగ్డే రాధే శ్యామ్, బీస్ట్, ఇప్పుడు ఆచార్య సినిమాల టాక్స్ తో హ్యాట్రిక్ కొట్టేసినట్టే. ఈ దెబ్బకి పూజ హెగ్డే హవా కూడా ఆల్మోస్ట్ తగ్గినట్టే.