నిజమే రామ్ చరణ్ వలన చిరు బలయ్యారు, అటు కొరటాల చిక్కుల్లో పడ్డారు. అదే హీరోల రాజమౌళి నెక్స్ట్ సెంటిమెంట్ కి మరోసారి రామ్ చరణ్ బుక్ అయ్యారు. రాజమౌళితో బ్లాక్ బస్టర్ తర్వాత ఎలాంటి హీరోకైనా ప్లాప్ పడాల్సిందే. ఇది రాజమౌళి తో సినిమాలు చేసిన హీరోలు అనుభవిస్తున్న సెంటిమెంట్. రాజమౌళి దర్శకత్వంలో హీరోల పెరఫార్మెన్స్ పీక్స్ లో ఉండడం, ఆ తర్వాత హీరోలు చేసే సినిమాల్లో కథ బలం లేకపోవడంతో, లేదంటే హీరోయిజం డల్ అవడం లాంటి కారణాలతో ప్లాప్స్ వస్తుంటాయి. రామ్ చరణ్ కె మగధీర తర్వాత ఆరెంజ్ లో డిసాస్టర్ పడింది. ఇక ఇప్పుడు ట్రిపుల్ ఆర్ బ్లాక్ బస్టర్ తరవాత ఆచార్య విషయంలోనూ అదే జరిగింది.
100 పెర్సెంట్ గ్యారెంటి ఈసారి రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాం.. రామ్ చరణ్ ఆచార్య తోనూ బ్లాక్ బస్టర్ కొడతాడు పక్కా అని చిరంజీవి ఏం చెప్పినా, ఎంత చెప్పినా ఆచార్య ని కాపాడలేకపోయారు. ఆచార్య ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాకి మిక్స్డ్ టాక్ పడినా పర్లేదు, క్రిటిక్స్ ఆచార్య ని చీల్చి చెండాడుతున్నారు. మెగా ఫాన్స్ కి కూడా ఆచార్య నచ్చలేదంటే ఆ సినిమా ఎలా ఉందొ అర్ధమవుతుంది. సిద్ధగా రామ్ చరణ్ చెయ్యాల్సింది చేసినా, ఎంతగా హైలెట్ అయినా.. ఆచార్య సినిమాని కాపాడలేకపోయాడు. అందరూ అనుకున్నట్టు, రాజమౌళి హీరోలు నమ్మేది.. ఇప్పుడు రామ్ చరణ్ విషయంలో నిజమైంది. అలా రామ్ చరణ్ వలన చిరు, కొరటాల హోల్సేల్ గా బుక్ అయ్యారు.