ఈ రోజు ఏప్రిల్ 28 టాప్ హీరోయిన్ సమంత పుట్టిన రోజు. సమంత బర్త్ డే స్పెషల్ గా ఆమె నటిస్తున్న పాన్ ఇండియా మూవీ లుక్స్ సోషల్ మీడియాలో హడావిడి చేసాయి. యశోద, శాకుంతలం మూవీస్ తో పాటుగా నిన్నగాక మొన్న మొదలైన VD11 నుండి కూడా సమంత కి స్పెషల్ బర్త్ డే విషెస్ అందాయి. అన్ని బాగానే ఉన్నాయి కానీ.. ఈ హీరోయిన్ కి బర్త్ డే రోజున బిగ్ షాక్ తగిలింది. అది సమంత తమిళంలో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నటించిన కన్మణి రాంబో కతీజా సినిమాకి వచ్చిన టాక్ తో ఆమెకి భారీ షాక్ తగిలింది. కన్మణి రాంబో కతీజా కి తెలుగులోనూ, తమిళం లోనూ రెండు చోట్లా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది.
కన్మణి రాంబో కతీజా కోసం దర్శకుడు విఘ్నేష్ శివన్ ఎంచుకొన్న కథ బాగానే ఉన్నప్పటికి.. ఆకట్టుకొనే కథనంతో కథను నడిపించలేకపోవడం మాత్రం సినిమాకి మైనస్ గా మారింది అని, ఎమోషనల్ పాయింట్‌ను లవ్ స్టోరీగా టర్న్ చెయ్యడం లో దర్శకుడి వైఫల్యం కనిపిస్తుంది అంటూ సినిమా చూసిన ఆడియన్స్ చెబుతున్న మాట. రాంబోగా విజయ్ సేతుపతి తన ఫెర్ఫార్మెన్స్‌తో ఆ పాత్రలో బాగానే నటించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో, క్లైమాక్స్‌లో విజయ్ సేతుపతి పెరఫార్మెన్స్ పీక్స్ లో కనిపించింది. నయనతార పాత్ర, సమంత పాత్ర సినిమాకి ప్లస్ కాలేదు. అలాగే ఈ టాప్ హీరోయిన్స్ ఇద్దరూ కేవలం గ్లామర్ షో కి తప్ప వారి పాత్రలను ప్రేక్షకులు ఫిల్ అవ్వలేదు.
ఫైనల్ గా కన్మణి రాంబో కతీజా సాదా సీదా కథతో విగ్నేష్ శివన్ ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయారు. దానితో సమంత కి బర్త్ డే రోజున ఈ సినిమా నెగటివ్ టాక్ తో బిగ్ షాక్ తగిలింది.