ఈ రోజు వరకు కెజిఎఫ్ చాప్టర్ 2 హావ తెలుగు రాష్ట్రాల్లో బాగానే నడిచింది. కాకపోతే సెకండ్ వీకెండ్ నుండి తెలుగు రాష్ట్రాల్లో కెజిఎఫ్ చాప్టర్ 2 పెరఫార్మెన్స్ తగ్గింది. గత సోమవారం నుండి ఆయా ఏరియాలలో కేవలం లక్షల్లో మాత్రమే కలెక్షన్స్ వస్తున్నాయ్. ఇక్కడ కెజిఎఫ్ కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే. కొద్దిగా బయ్యర్లు లాస్ అయ్యేలా ఉన్నారు. అయితే ఆ లాస్ జస్ట్ లక్షల్లోనే ఉటుంది అని అంచనా వేస్తున్నారు.. కొద్దిపాటి నష్టాలతోనే బయ్యర్లు గట్టెక్కేస్తారని ట్రేడ్ వర్గాలు అంచనా.. అయితే ఇక రేపటి నుండి కెజిఎఫ్ షట్టర్ మూసుకోవాల్సి వస్తుంది.
ఎందుకంటే.. మెగాస్టార్ చిరు ఆచార్య వచ్చేస్తుంది. రేపు శుక్రవారమే ఆచార్య రిలీజ్ కాబోతుంది. భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో ఆచార్య ఆడియన్స్ ముందుకు రాబోతుంది. రామ్ చరణ్ కూడా ఆచార్య లో నటించడం తో సినిమాపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అటు ఓవర్సీస్ లోను విపరీతమైన క్రేజ్ ఉంది. అక్కడ కూడా ఇకపై కెజిఎఫ్ చాప్టర్ హవా తగ్గడం ఖాయం. ఇప్పటికే అంతంత మాత్రం కలెక్షన్స్ తో కిందా మీదా పడుతున్న కెజిఎఫ్ చాప్టర్ 2 రేపటినుండి పూర్తిగా పడిపోతుంది. ఆచార్య హావ మొదలైతే.. కెజిఎఫ్ చాప్టర్ క్లోజ్ అవ్వాల్సిందే కదా.