మహేష్ బాబు - పరశురామ్ కలయికలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై ఉంది టీం. అటు సినిమా రిలీజ్ కి కేవలం రెండు వారాల మాత్రమే టైం ఉంది.. దానితో టీం ప్రమోషన్స్ తో రంగంలోకి దిగబోతుంది. స్టైలిష్ లుక్స్ లోను, మాస్ లుక్స్ తోనూ మహేష్ బాబు సర్కారు వారి పాట పై అంచనాలు పెంచేస్తున్నారు. మే 12 న విడుదల కాబోతున్న సర్కారు వారి పాట ట్రైలర్ కి డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్.
సర్కారు వారి పాట ట్రైలర్ మే 2 న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ పోస్టర్ లో మహేష్ బాబు కంప్లీట్ యాక్షన్ లుక్ లో కనిపించారు. రెండు చేతుల్లో తాళల గుత్తులు పట్టుకొని వంటికాలిపై నిల్చుని రౌడీ గ్యాంగ్ తో హైవోల్టేజ్ ఫైట్ చేస్తున్న విజువల్ ఈ పోస్టర్ లో కనిపించడం అభిమానులకి గూస్ బంప్స్ వచ్చేసేలా ఉంది. దానితో మహేష్ బాబు ఫాన్స్ సోషల్ మీడియాలో సర్కారు వారి పాటని ట్రెండ్ చెయ్యడమే కాదు.. మే 2 న యూట్యూబ్ రికార్డ్స్ ని బద్దలు కొట్టి మహేష్ పేరు మీద కొత్త రికార్డులని రాయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే సర్కారు వారి పాట కళావతికి సాంగ్ యూట్యూబ్ రికార్డ్స్ ని చెల్లాచెదురు చేసింది. ఇప్పుడు సర్కారు వారి పాట ట్రైలర్ రాబోతుంది. ఇకపై ఆ ట్రైలర్ కి రికార్డ్ వ్యూస్, లైక్స్ తో యూట్యూబ్ ని షేక్ చెయ్యాలని మహేష్ ఫాన్స్ ప్లాన్స్ లో ఉన్నారు.