మెగాస్టార్ చిరు గత ఏడాది డిసెంబర్ నుండి ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీ ప్రాజెక్ట్ మెగా 154 షూటింగ్స్ తో క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడుపుతున్నారు. నాలుగు సినిమాల షూటింగ్స్ ఒకేసారి చేస్తూ ఆయన యంగ్ ఎనేర్జిటిక్ డేస్ ని గుర్తుకు తెచ్చారు. అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరు ఆచార్య మూవీ రిలీజ్ మూడ్ లో ఉన్నారు. గత వారం రోజులుగా ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్, హరీష్ శంకర్ తో ఇంటర్వ్యూ, చరణ్ తో కలిసి ఇంటర్వూస్ ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. మెగాస్టార్ ఆచార్యుడు రేపు 29 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఆచార్య మూవీ రిలీజ్ టెంక్షన్ తీరిపోగానే చిరు ఏం చేయబోతున్నారో అనే విషయంలో అందరిలో క్యూరియాసిటీ మొదలయ్యింది.
అంటే ఆచార్య రిలీజ్ అయ్యాక భోళా శంకర్, గాడ్ ఫాదర్, బాబీ మెగా 154 ప్రాజెక్ట్ తో బిజీగా వుంటారనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆచార్య రిలీజ్ అయ్యాక మెగాస్టార్ చిరు కాస్త రిలాక్స్ అవ్వబోతున్నారట. అంటే షూటింగ్స్ నుండి చిన్న బ్రేక్ తీసుకోబోతున్నారు. మే 1న చిరు షూటింగ్స్ కి ప్యాకప్ చెప్పేసి వెకేషన్స్ ని వెళ్ళబోతున్నారు. ఫ్యామిలీతో చిరు వెకేషన్స్ పూర్హయ్యాక మళ్ళీ తన తదుపరి ప్రాజెక్ట్స్ షూటింగ్స్ కి హాజరవుతారని తెలుస్తుంది. అయితే మెగాస్టార్ దాదాపుగా ఓ నెల పాటు దర్శకులకి అందుబాటులోకి రాకపోవచ్చు అని, ఈ నెలరోజుల పాటు ఆయన విదేశీ ట్రిప్ లోనే ఉండబోతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం.