Advertisementt

క్రేజ్ ని క్యాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు

Thu 28th Apr 2022 10:33 AM
koratala siva,acharya hindi release,acharya,ram charan  క్రేజ్ ని క్యాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు
Koratala opens up on Acharya Hindi release క్రేజ్ ని క్యాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు
Advertisement
Ads by CJ

క్రేజ్ ఉంది కదా అని పాన్ ఇండియా మార్కెట్ లో సినిమా ని విడుదల చేసి క్యాష్ చేసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు కొరటాల శివ. అంటే ఆచార్య ని మొదలు పెట్టి రిలీజ్ డేట్ ఇచ్చినప్పుడు ఆ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేస్తారు. అప్పుడు రంజాన్ కి సల్మాన్ ఖాన్ కి - చిరు కి హిందీలో పోటీ షురూ అన్నారు. కానీ కరోనా ఏ ఫైట్ జరగనివ్వలేదు. ఇక నిన్నమొన్నటివరకు ఆచార్య హిందీ రిలీజ్ ఉంటుంది అనే టాక్ నడిచినా ఆచార్య ప్రమోషన్స్ లో రామ్ చరణ్ ముందు ఇక్కడ రిలీజ్ చేసాక.. తర్వాత హిందీలో రిలీజ్ చేద్దామని అనుకున్నామని, ఎందుకంటే హిందీ రిలీజ్ కి సమయం లేదు అని చెప్పారు.

ఇక తాజాగా కొరటాల కూడా మరోసారి ఆచార్య హిందీ రిలీజ్ విషయంపై స్పందించారు. చిరు కి చరణ్ కి హిందీలో క్రేజ్ ఉంది కదా అని.. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకునే ఉద్దేశ్యం లేదు. ఆచార్య మొదలైనప్పటినుండి కేవలం తెలుగుకి మాత్రమే ఈ సినిమా చేద్దామనుకున్నాం. తర్వాత పాన్ ఇండియా సమీకరణాలు మారడంతో హిందీలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే డిస్కర్షన్స్ నడిచాయి. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కి సమయం లేకపోవడం.. ఇలా గజి బిజీగా సినిమా ని హిందీలో రిలీజ్ చేసి క్రేజ్ ని క్యాష్ చేసుకునే ఉద్దేశ్యం లేకనే ఆచార్యని పాన్ ఇండియాలో రిలీజ్ చెయ్యలేదు అని చెప్పారు కొరటాల.

Koratala opens up on Acharya Hindi release:

Not Missed Opportunity: Koratala Siva about Acharya Hindi release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ