ఈ రోజు ఉదయం ఆచార్య ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్- దర్శకుడు కొరటాల శివ లు విజయవాడకి వెళ్లారు. అక్కడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం సమయంలో రామ్ చరణ్, కొరటాల శివ దగ్గరికి అభిమానులు అక్కడ ఉన్న గ్రిల్స్ ని తోసుకుంటూ ఒక్కసారిగా మీదకి వచ్చేసి ఫొటోస్ తీస్తూ నానా హంగామా సృష్టించారు. అసలు రామ్ చరణ్ గన్నవరం ఎయిర్ పోరు కి రాగానే.. మెగా ఫాన్స్ బైక్స్ తో ర్యాలీ నిర్వహించారు.
దుర్గ గుడిలో అమ్మవారి దర్శనంలో ఉన్న రామ్‌చరణ్‌ను చూసేందుకు అభిమానులు లోపలికి దూసుకొచ్చారు. అక్కడ అంతరాలయంలో జై చరణ్ అంటూ జాతరని తలపించడమే కాదు.. మొబైల్ ఫోన్లతో రామ్ చరణ్ ని వీడియోలు తీశారు. ఈ క్రమంలో ఆలయంలోని కానుకల హుండీలపై నిలబడిన ఫాన్స్ ని ఎంత వారించినా వారు వెనక్కి తగ్గలేదు. అయితే పోలీసులు, ఆలయ అధికారుల సమన్వయ లోపం కారణంతో అక్కడ గందరగోళం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత చరణ్, కొరటాల ఫాన్స్ తోపులాటలోనే బయటికి వచ్చి కారెక్కి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిపోయారు.