Advertisementt

మళ్ళీ మారిన అడివి శేష్ మేజర్ డేట్

Wed 27th Apr 2022 12:19 PM
adivi sesh,pan india film,major,major releasing worldwide on june 3rd  మళ్ళీ మారిన అడివి శేష్ మేజర్ డేట్
Major Releasing Worldwide On June 3rd మళ్ళీ మారిన అడివి శేష్ మేజర్ డేట్
Advertisement
Ads by CJ

ఇప్పడు చాలా సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి, అలాగే ప్రీ పోన్ కూడా అయిన సందర్భాలు ఉన్నాయి. కరోనా పాండమిక్ సిట్యువేషన్ లో చాలా సినిమాలు చాలా డేట్స్ మార్చుకుంటూ ఫైనల్ గా ఓ డేట్ కి ఫిక్స్ అవుతున్నాయి. అందులో అడివి శేష్ పాన్ ఇండియా మూవీ మేజర్ కూడా ఉంది. గత ఏడాది అడివి శేష్ మేజర్ డేట్ ని ఈ ఏడాది ఫిబ్రవరి 11 న అని చెప్పి అనౌన్స్ చేసినా.. అది కుదర్లేదు. తరవాత మే 27 న పాన్ ఇండియా మూవీ గా మేజర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

కానీ మళ్ళీ మేజర్ డేట్ మారినట్లుగా మేకర్స్ మహేష్ బాబు అఫీషియల్ గా ప్రకటన ఇచ్చారు. మహేష్ బాబు GMB ఎంటరైన్మెంట్ లో మేజర్ మూవీ ని నిర్మించారు. ఇక ఇప్పుడు మేజర్ మూవీ జూన్ 3 న పాన్ ఇండియా లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కాబోతున్నట్టుగా ప్రకటించారు. అంటే మే 27 నుండి ఓ వారం పోస్ట్ పోన్ అయ్యి జూన్ 3 కి ఫిక్స్ అయ్యింది.

ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ లో అడివి శేష్ నుదిటిపై గాయంతో కనిపించగా, తాజ్ హోటల్‌కు ఉగ్రవాదులు నిప్పుపెట్టిన విజువల్ స్టన్నింగా కనిపిస్తుంది. అడివి శేష్ మేజర్ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే కూడా అందించారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ - శోభిత దూళిపాళ్ల నటించారు.

Major Releasing Worldwide On June 3rd:

Adivi Sesh Pan India Film Major Releasing Worldwide On June 3rd

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ