ప్రస్తుతం చిరంజీవి - రామ్ చరణ్ - కోరటాల శివ లు ఆచార్య ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకువెళుతున్న్నారు. రేపు శుక్రవారం రిలీజ్ కాబోతున్న ఆచార్య ని ఆడియన్స్ కి దగ్గర చెయ్యడానికి శత విధాలా ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మంగళవారం ఆచార్య రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించిన టీం ఈ రోజు ఉదయం విజయవాడ కి వెళ్ళింది. కొరటాల, రామ్ చరణ్ లు అక్కడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్ కి రాబోతున్నారు. రేపు నైట్ నుండే ఓవర్సీస్ లో ఆచార్య ప్రీమియర్స్ స్టార్ట్ అవడమే కాదు.. ఆచార్య టాక్ తో సోషల్ మీడియా షేక్ అవ్వడానికి రెడీ అవుతుంది.
ఇక ఇప్పుడు ఆచార్య లో మెయిన్ హైలెట్ సీన్స్ ఇవే అంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. చిరు - చరణ్ కాంబో సీన్స్ ప్రతిదీ మెగా ఫాన్స్ కి కిక్ ఇస్తాయని, అలాగే ఇంటర్వెల్ సీన్ మెయిన్ హైలెట్స్ లో ఒకటిగా నిలవబోతుంది అని అంటున్నారు. చిరు - రామ్ చరణ్ కలయికలో వచ్చే యాక్షన్ సన్నివేశం, పాదఘట్టం దగ్గర, టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి ఫైట్ సీన్ కూడా ఫాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేవిగా ఉండబోతున్నాయట. ప్రీక్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ దాదాపు 30 నినిమాల పాటు వచ్చే సన్నివేశాలు ఫాన్స్ తో విజిల్స్ వేయించేవిగా ఉంటుంది అంటూ ఆచార్య పై అంచనాలు పెంచేస్తున్నారు.