బిగ్ బాస్ నాన్ స్టాప్ సోమవారం నామినేషన్స్ లో రసాభాసగా అఖిల్, అశు, బిందు మాధవి తప్ప హౌస్ లో ఉన్నవారంతా నామినేషన్స్ లోకి వెళ్లగా ఈ వారం కెప్టెన్సీ టాస్క్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇంట్లో ఉన్న ఒక్కో కంటెస్టెంట్ ని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి ఈ ఇంట్లో కిల్లర్ మీరే అంటూ.. హౌస్ మేట్ ఎగ్జైట్ అయ్యేలోపు మీరు కాదు కిల్లర్ అంటూ.. బాబా భాస్కర్, అరియనా, అశు రెడ్డి, అఖిల్ అనిల్, హమీద, మిత్రా శర్మ ఇలా అందరిని పిలిచి ఆటపట్టించిన బిగ్ బాస్ చివరికి ఈ కిల్లర్ గా నటరాజ్ మాస్టర్ ని ఎంపిక చేసి హౌస్ లో ఉన్న వారిని ఒక్కొకరుగా చంపమని చెప్పడమే కాకుండా నటరాజ్ కి ఓ ఫోన్ ఇచ్చి మరీ బిగ్ బాస్ ఆదేశంతో ఒక్కొక్కరిని చంపాలి అని చెప్పారు.
తర్వాత హౌస్ లో ఇంట్రెస్టింగ్ గా గేమ్ లేదు అని అఖిల్ బాత్ రూమ్ దగ్గరకికి వెళ్లి నటరాజ్ డెడ్ అని రాసాడు.. దానితో హౌస్ మేట్స్ అల్లకల్లోలంగా ఆలోచించారు. అలాగే మిత్ర బెడ్ రూమ్ లో రాసింది. ఆశు బాత్ రూమ్ డోర్ పై రాసింది.. ఇలా ఎవరికి వారే టాస్క్ లో క్రేజ్ తేవడానికి ప్రయత్నం చెయ్యగా.. నటరాజ్ బిగ్ బాస్ ఫోన్ కాల్స్ మేరకు.. శివ, అరియనా, అనిల్ ని కిల్ చేసాడు. శివకి ఉప్పు వేసిన కాఫీ తాగించాడు. అరియన్ బెడ్ పై వాటర్ పోసాడు. అలాగే అనిల్ కి కలర్ రాసాడు. సో నటరాజ్ కిల్లర్ గా హౌస్ మేట్స్ కి దొరక్కుండా గేమ్ ఆడుతున్నాడు, మరి ఈ గేమ్ ఈరోజు కూడా కంటిన్యూ అవ్వబోతుంది. చూద్దాం ఇంకెత ఇంట్రెస్టింగ్ గా ఈ టాస్క్ ఉంటుందో అనేది.