ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ నే చెప్పుకునేవారు. కానీ బాహుబలి పాన్ ఇండియా మూవీ తర్వాత తెలుగుకి గొప్ప గౌరవం దక్కింది.. అంటూ చిరంజీవి ఆచార్య ప్రమోషన్స్ లో పదే పదే టాలీవుడ్ ని పొగుడుతున్నారు. అంతేకాకుండా హిందీలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న కపూర్ ఫ్యామిలీ అంటే హిందీ ఇండస్ట్రీ, హిందీ ఇండస్ట్రీ అంటే కపూర్ ఫ్యామిలీ అని చెప్పుకునేవారు. అంతలాంటి గొప్ప గౌరవం తెలుగులో మెగా ఫ్యామిలీకి దక్కాలన్నది నా ఆశ. మా ఫ్యామిలీ నుండి హీరోలుగా వచ్చిన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లు హీరోలుగా గొప్పగా రాణిస్తూ ఇండస్ట్రీలో తమకంటూ ఓ స్టేటస్ తెచ్చుకోవడం చాలా హ్యాపీ గా ఉంది అంటున్నారు చిరు.
అంతేకాకుండా హిందీ పరిశ్రమలో సౌత్ వారికి ఎన్నో అనుమానాలు భరించాం. ఢిల్లీ లో హిందీ సినిమా ఇండస్ట్రీకి ఓ గౌరవం, పెద్ద పీట వేసేవారు. అప్పుడు నాకు చాలా అవమానంగా ఉండేది. ఇప్పుడు బాహుబలి, ట్రిపుల్ ఆర్, పుష్ప, రాధే శ్యామ్ సినిమాలతో పాన్ ఇండియా క్రేజ్ ఇండియా వైడ్ గా విస్తరించడంతో తెలుగుకి ప్రతి భాషలో గొప్ప గౌవరం దక్కింది అంటూ చిరు సంచలన వ్యాఖ్యలు చేసారు.