ఆచార్య లో అసలు రామ్ చరణ్ పాత్రకి మహేష్ బాబు అయితే బావుంటుంది అనే ఆలోచనే రాలేదు అంటూ కొరటాల తెగ్గొట్టేసారు. అదే ప్రశ్న అంటే.. ఆచార్య లో చరణ్ పాత్రని ఆయన కాకుండా ఏ హీరో అయినా న్యాయం చేసేవారు అదే పవన్ కళ్యాణ్ అయితే మరింత న్యాయం చేసెవాడు అంటూ ఆచార్య ప్రమోషన్స్ లో చిరు చెప్పారు. కరోనా వలన సినిమా ఇండస్ట్రీ కుదేలయింది అని, దాని వలన ఆచార్య కి 50 కోట్లు ఇంట్రెస్ట్ కట్టామని, దానికి కోసం టికెట్ రేట్స్ పెంచమని అడ్డుకున్నామని అందులో ఎలాంటి తప్పు లేదని చెప్పిన చిరు ని.. ఆచార్య లో సిద్ద కేరెక్టర్ కి చరణ్ కాకుండా పవన్ కళ్యాణ్ నటించి ఉంటే ఎలా ఉండేది అంటూ అడిగిన ప్రశ్నకి చిరు ఆసక్తికర సమాధానం చెప్పారు.
రామ్ చరణ్ గనక సిద్ద కేరెక్టర్ ని ఒప్పుకోకపోతే, ఒకవేళ చరణ్‌కు కుదరకపోయి ఉంటే.. వేరే ఇతర ఏ హీరో అయినా ఈ పాత్రకు న్యాయం చేయగలరు.. అందులో సందేహమే లేదు. కాకపోతే చరణ్ చేస్తే ఆ ఫీల్, ఫాదర్ అండ్ సన్ బాండింగ్ సినిమాకి మరింత ప్లస్ అవుతుందని అనుకున్నాం. చరణ్ గనక దొరక్కపోతే పవన్ పర్ఫెక్ట్ గా సరిపోయేవాడు. పవన్ కళ్యాణ్ ఉంటే అనే ఫీలింగ్ నాకు వచ్చింది.. బట్ చరణ్ అంతవరకు ఎవరికీ ఆ ఛాన్స్ రానివ్వలేదు అంటూ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు.