ఇప్పుడు కాజల్ విషయంలో ఆచార్య డైరెక్టర్ కొరటాల శివ చేసిన అన్యాయం కాజల్ ఫాన్స్ కి చాలా బాధించింది. కొద్ది రోజులు షూటింగ్ చేసాక ఆమె కేరెక్టర్ లేదు అంటే కాజల్ ఎంతగా ఫీలై ఉండాలి. సరే అదంతా ఏమో కానీ.. ఇప్పుడు కాజల్ కి చేసిన అన్యాయమే విలన్ సోను సూద్ కి కూడా జరిగిందా అనే డౌట్ ఇప్పుడు ఆయన ఫాన్స్ లోను మొదలయ్యింది. ఎందుకంటే సోను సూద్ ఆచార్య లో విలన్ కేరెక్టర్ చేసారు. మరి విలన్ అంటే హీరో తర్వాత అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర అదే. కానీ సోను సూద్ ఆచార్య ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించలేదు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ, ఇటు రిలీజ్ ప్రెస్ మీట్ లో కానీ, ఓ ఇంటర్వ్యూ లో కానీ ఎక్కడా సోను సూద్ ఎంట్రీ లేదు. ఆచార్య టీం కూడా సోను సూద్ పేరు ఎత్తడం లేదు. మరి సోను సూద్ కేరెక్టర్ నిడివి కూడా తగ్గించారా? లేదంటే సోను సూద్ ఒక్క ఆచార్య ఇంటర్వ్యూలో అయినా కనిపించేవారు కదా అంటూ సోను సూద్ ఫాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. మరి సోను సూద్ క్యారెక్టర్ ని కూడా కట్ చేసారా.. చరణ్ - చిరు కాంబో సీన్స్ కోసం కొంతమంది కేరెక్టర్స్ ని లేపేసారనే టాక్ ఉంది. మరి సోను సూద్ పాత్ర ఎలా ఉండబోతుందో అనేది మరొక్క రెండు రోజుల్లో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుందిలే.