కొరటాల శివ ప్రస్తుతం ఆచార్య ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఇంటర్వూస్ ఇస్తున్నారు. కొరటాల కి ఆచార్య కంప్లీట్ అయ్యాక యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో NTR30 కమిట్మెంట్ ఉంది. ఎన్టీఆర్ - కొరటాల ప్రాజెక్ట్ జూన్ నుండి పట్టాలెక్కబోతుంది. అయితే ఈ సినిమా గురించి అప్ డేట్స్ విషయంలో కొరటాల ని మీడియా పదే పదే అడుగుతూ ఇబ్బంది పెడుతుంది. ఆచార్య ప్రమోషన్స్ లో NTR30 విషయాలు మాట్లాడను అన్నా కొరటాలని వదలడం లేదు. అందుకే చాలా జాగ్రత్తగా కొరటాల శివ NTR30 పై ఓపెన్ అవుతున్నారు. హీరోయిన్ గా అలియా భట్ ని అనుకున్నామని కాని అలియా కి ఇంకా కథ వివవరించలేదని చెప్పారు. అలాగే ఎన్టీఆర్ తో ఓ బలమైన కథ తో సినిమా చేస్తున్న అన్నారు.
ఇక తాజాగా తన ఫస్ట్ మూవీ మిర్చి ని మించి ఎన్టీఆర్ తో సినిమా ఉంటుంది అని.. మిర్చి తర్వాత మళ్ళీ అంత హై ఓల్టేజ్ మూవీ చెయ్యలేదు అని, ఎన్టీఆర్ తో చెయ్యబోయే సినిమా మిర్చిని మించి హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా ఉండబోతుంది అని, ఈ కథ అన్ని భాషల ఆడియన్స్ కి నచ్చేలా ఉంటుంది కాబట్టి.. ఈసారి టాలీవుడ్ పరిధి దాటి సినిమా చేయబోతున్నట్లుగా కొరటాల చెప్పడంతో ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీ గా ఫీలవుతున్నారు.