బాలకృష్ణ అఖండ తో అఖండమైన విజయం సాధించి అదే జోష్ లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 షూటింగ్ కి వెళ్లిపోయారు. NBK 107 లో బాలయ్య పవర్ ఫుల్ లుక్ కి నందమూరి ఫాన్స్ మాత్రమే కాదు.. ప్రతి సినీ ప్రేక్షకుడు ఫిదా అయ్యారు. అంతలాంటి మాస్ లుక్ లో బాలయ్య బ్లాక్ డ్రెస్ లో కనువిందు చేసారు. అయితే ఇప్పుడు బాలయ్య - గోపీచంద్ మూవీ కొన్ని రోజులు వాయిదా పడనున్నట్లుగా తెలుస్తుంది. కారణం బాలకృష్ణ కి మరో సర్జరీ జరగడమేనట. ఇంతకుముందు అఖండ రిలీజ్ టైం లో బాలయ్య చేతికి సర్జరీ చేయించుకున్నారు.
ఇప్పుడు మాత్రం బాలయ్య మోకాలికి సర్జరీ జరిగినట్లుగా తెలుస్తుంది. బాలకృష్ణ గత కొన్ని రోజులుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారట. అందుకే మోకాలికి డాక్టర్స్ సర్జరీ చేసారని, అది మైనర్ సర్జరీనేనని, బాలయ్య ఆరోగ్యం బాగుందని, బాలయ్య ఆరోగ్యం పై ఫాన్స్ ఎవరూ కంగారు పడాల్సిన అవసరలం లేదని చెప్పిన డాక్టర్స్ కొద్దిరోజుల పాటు బాలకృష్ణ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అని సూచించినట్లుగా తెలుస్తుంది. దానితో బాలయ్య - గోపీచంద్ మూవీ షూటింగ్ కొద్దీ రోజులు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చేలా ఉంది. ఇక బాలయ్య త్వరగా కోలుకోవాలంటూ నందమూరి ఫాన్స్ పూజలు చేస్తున్నారు.