బిగ్ బాస్ నాన్ స్టాప్ కంటెస్టెంట్స్ మధ్యన గొడవలు, కంటెస్టెంట్స్ మధ్యన కెప్టెన్సీ టాస్క్ ల విషయంలో జరిగే ఆటలతో అలా అలా ఎనిమిది వారాలు పూర్తయ్యాయి. ఎనిమిదివారాలకు గాను ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. ముమైత్ ఖాన్ రెండుసార్లు ఎలిమినేట్ అయ్యింది. ఈ ఆదివారం స్ట్రాంగ్ అనుకున్న అజయ్ ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడాడు. ఈ వారం నామినేషన్స్ రసవత్తరంగా కాదు.. చాలా గొడవల మధ్యన జరిగిపోయాయి. నటరాజ్ కి అరియనాకి మధ్యన పెద్ద గొడవే జరిగింది. అరియనా ఏడ్చింది కూడా. అలాగే అఖిల్ శివ ని నామినేట్ చెయ్యగా మరోసారి వారిద్దరికి మధ్యన గొడవైంది.
అయితే ఈ వారం నామినేషన్స్ లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటి అంటే.. ఫ్రెండ్స్ అయిన బిందు - శివ ల మధ్యన గత వారం నామినేషన్స్ టాపిక్ విషయంలో పెద్ద గొడవే జరిగింది. అలా శివని బిందు నామినేట్ చేసింది. ఇక ఎప్పటిలాగే మిత్ర శర్మ.. శివని, బిందు ని నామినేట్ చేసి నానా యాగీ చేసింది. మిత్ర శర్మ బిహేవియర్ తట్టుకోలేకపోయారు. అనిల్ - నటరాజ్ మధ్యన బాగా గొడవైంది. హమీద - అరియనాకి మధ్య పంచాయితీ జరిగింది.
ఫైనల్ గా ఈ వారం నామినేషన్స్ లోకి నటరాజ్, శివ, మిత్ర, అరియనా, బాబా భాస్కర్, హమీద, మరియు అనిల్ లు ఉన్నారు. అందులో అశు రెడ్డి, బిందు లు నామినేషన్స్ నుండి తప్పించుకున్నారు. వారికీ కూడా ఒక్కో ఓట్ పడినా.. వారు నామినేషన్స్ లోకి వెళ్ళలేదు. అఖిల్ కెప్టెన్ అయిన కారణంగా ఎవరూ నామినేట్ చెయ్యలేదు.