పాపం పవన్ కళ్యాణ్ పడే కష్టాలు ఏ హీరోకి రాకూడదు సుమీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అటు సినిమాలు ఇటు రాజకీయాలతో నలిగిపోతున్నారు. నిన్నగాక మొన్న ఏలూరు జిల్లాలో పర్యటించి చింతలపూడి లో బహిరంగ సభ పెట్టిన పవన్ కళ్యాణ్ తాజాగా హరి హర వీరమల్లు షూటింగ్ సెట్ లో కొత్త షెడ్యూల్ అవుట్ ఫుట్ చూస్తున్న పిక్ ని వదిలారు హరి హర వీరమల్లు మేకర్స్. గత ఏడాది కరోనా సెకండ్ వేవ్ తో వాయిదా పడిన హరి హర వీరమల్లు మళ్ళీ ఈ ఏడాది కొత్త షెడ్యూల్ తో ఈమధ్యనే పట్టాలెక్కింది.
మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథ క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో వేసిన స్పెషల్ సెట్ లో కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈమధ్యనే పవన్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుని డూప్ లేకుండా హరి హర వీరమల్లు కొత్త షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. అలనాటి కాలం ప్రతిబింభించడం కోసం ఎక్కువగా భారీ సెట్స్ మీదే టీం ఆధారపడింది. తోట తరణి ఆధ్వర్యంలో ఈ భారీ సెట్స్ నిర్మాణం జరుగుతుంది. అయితే కొత్త షెడ్యూల్ లో కొంత చిత్రీకరణ జరిపాక ఆ సీన్స్ ని డైరెక్టర్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా మానిటర్ లో చాలా ఆసక్తిగా చూస్తూ ఉన్న ఫొటోను సోషల్ మీడియా లో షేర్ చేసారు. దానితో ఆ పిక్ క్షణాల్లో వైరల్ అయ్యింది. ఈ సినిమాలో పవన్ గజ దొంగగా కనిపిస్తుంటే.. నిధి అగర్వాల్ పంచమి పాత్రలో కనిపిస్తుంది. అర్జున్ రామ్ పాల్ కీలకపాత్రలో కనిపిస్తున్నారు.