ఆచార్య సినిమా నుండి కాజల్ అగర్వాల్ ని తీసేసాం.. ఆచార్య కి హీరోయిన్ కి అంతగా లవ్, ఎమోషన్స్ సీన్స్ లేవు. అంత పెద్ద హీరోయిన్ అయిన కాజల్ ని చిన్నపాటి రోల్ కి తగ్గించడం భావ్యం కాదు కాబట్టే కాజల్ తో చర్చించి కాజల్ రోల్ లేపేసాం ఇది దర్శకుడు కొరటాల శివ చెప్పిన సమాధానం. ముందు నుండే రామ్ చరణ్ రోల్ కోసం కాజల్ సీన్స్ ని ఎడిటింగ్ లో లేపేసారనే ప్రచార ఉంది. ఇప్పుడు అదే జరిగినట్లుగా అర్ధమవుతుంది. అయితే ఆచార్య ఆరంభం అయినప్పుడు రామ్ చరణ్ ది కేవలం గెస్ట్ రోల్ మాత్రమే. కానీ ఆ తర్వాత ఆ రోల్ నిడివి పెరిగిపోయింది అని కోరటాలే చెప్పారు. అందుకే మొదట్లోనే హీరోయిన్ త్రిష ఆచార్య కి బైబై చెప్పేసింది.
అప్పట్లో అంటే ఆచార్య మొదలైన కొత్తల్లో త్రిష ఆచార్య హీరోయిన్ గా ఎంపికై కొద్దిపాటి షూటింగ్ చేశాకే ఆమె ఆచార్య నుండి తప్పుకుంది. అప్పట్లో త్రిషకి యూనిట్ కి ఏదో గొడవైంది అందుకే అర్ధాంతరంగా తప్పుకుంది అన్నారు. ఆ వెంటనే త్రిష ప్లేస్ లోకి కాజల్ ని తెచ్చేసారు. అయితే త్రిష కి రామ్ చరణ్ రోల్ పెరిగింది.. తన రోల్ తగ్గుతుంది అని భావించే అప్పట్లో ఆచార్య నుండి వాకౌట్ చేసి ఉండొచ్చు అనేది ఇప్పుడు కాజల్ ని తప్పించడంతో కలుగుతున్న అనుమానం. తన రోల్ నిడివి ఎంతో లేని కారణంగా త్రిష ఆచార్య నుండి తప్పుకుంది అని ఇప్పుడు అందరూ ఫిక్స్ అవ్వడమే కాదు.. త్రిష మంచి పని చేసింది అని కూడా అంటున్నారు.