Advertisementt

ఆచార్య వెనక్కి తగ్గడం మెగా ఫాన్స్ కి నచ్చట్లేదు

Mon 25th Apr 2022 03:12 PM
acharya,acharya hindi release,ram charan,chiranjeevi,koratala  ఆచార్య వెనక్కి తగ్గడం మెగా ఫాన్స్ కి నచ్చట్లేదు
All about Acharya Hindi release ఆచార్య వెనక్కి తగ్గడం మెగా ఫాన్స్ కి నచ్చట్లేదు
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా మూవీ అనే పేరు లేకపోయినా ఇప్పుడు టాలీవుడ్ లో తెరకెక్కుతున్న ప్రతి సినిమా హిందీ ని టార్గెట్ చేస్తుంది. కారణం ఇక్కడి యాక్షన్ సినిమాలకి హిందీలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది కాబట్టి. గతంలో ఇక్కడి క్రేజీ యాక్షన్ మూవీస్ హిందీ యూట్యూబ్ లో హిట్ అవడంతో.. ఇక ఇప్పుడు ప్రతి హీరో తెలుగుతో తమిళ్ తో పాటుగా హిందీ లోను డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఖిలాడీ అలానే విడుదలైంది. తర్వాత భీమ్లా నాయక్ మేకర్స్ హడావిడి చేసినా ఎందుకో హిందీ వెర్షన్ పై వారు వెనక్కి తగ్గారు. ఇక మెగాస్టార్ చిరు ఆచార్య మూవీ మొదటి నుండి హిందీ రిలీజ్ ఉంటుంది అంటూ ప్రచారం జరిగింది.

కానీ విడుదలకు దగ్గరయ్యాక కానీ ఆచార్యని హిందీలో రిలీజ్ చెయ్యడం లేదు అంటున్నారు. నిన్నమొన్నటివరకు ఆచార్య హిందీలో రిలీజ్ ఉంటుందనే అన్నారు. కానీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక అనుమానాలు మొదలయ్యాయి. దానికి రామ్ చరణ్ కూడా ఆచార్యని ని హిందీ లో రిలీజ్ చెయ్యడానికి టైం సరిపోవడం లేదు. సో ఇక్కడ రిలీజ్ అయ్యాక తర్వాత హిందీలో రిలీజ్ చేద్దామనుకుంటున్నాం అంటూ చెప్పేసరికి.. ఆచార్య హిందీలో వెనకడుగు వెయ్యడంతో మెగా ఫాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు. ట్రిపుల్ ఆర్ లాంటి భారీ హిట్ తర్వాత రామ్ చరణ్ మూవీ హిందీ లో రిలీజ్ అయితే మంచి ఓపెనింగ్స్ అలాగే కలెక్షన్స్ వచ్చేవి.. కానీ ఇప్పుడు ఇలా వెనక్కి తగ్గడం మెగా ఫాన్స్ కి నచ్చడం లేదు.

All about Acharya Hindi release:

Acharya Hindi release: Here the answer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ