Advertisementt

సలార్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పై క్రేజీ న్యూస్

Mon 25th Apr 2022 12:25 PM
prabhas,valley,salaar,prashanth neel,kgf 2  సలార్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పై క్రేజీ న్యూస్
Interesting news on Prabhas Salaar movie సలార్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ పై క్రేజీ న్యూస్
Advertisement
Ads by CJ

ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ హవా మరో వారం లో ముగియబోతుంది. కెజిఎఫ్ చాప్టర్ 2 తో అనుకున్న అంచనాలను అందుకుని క్రేజీగా మారిన ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సలార్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రభాస్ తో సలార్ ఎప్పుడో గత ఏడాదే మొదలు పెట్టిన ప్రశాంత్ నీల్ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుని మూడో షెడ్యూల్ కోసం మే ఫస్ట్ వీక్ కి రెడీ అవుతున్నారు. సలార్ ఫుల్లీ యాక్షన్ ప్యాక్డ్ మూవీ. సలార్ లో ప్రభాస్ లుక్, మాస్ స్టయిల్ అన్ని అప్పుడప్పుడు సోషల్ మీడియాలో లీకుల ద్వారా ఫాన్స్ ఆనందపడుతున్నారు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ చాలా క్రూరంగా నెగెటివ్ గా కనిపిస్తారంటూ ప్రశాంత్ నీల్ సలార్ పై అంచనాలు మరింతగా పంచేసారు. 

ఇక ఇప్పుడు ప్రభాస్ సలార్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సలార్ ప్రీ క్లైమాక్స్ లో ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం మేకర్స్ ఏకంగా 20 కోట్లు ఖర్చు పెట్టారట. హాలీవుడ్ స్థాయిలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఈ యాక్షన్ ఎపిసోడ్ మొత్తం భయంకరమైన ఒక లోయలో చిత్రీకరించారని, ఛేజింగ్ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ యాక్షన్ సీన్ ను కూడా ఆల్రెడీ చిత్రీకరించారట. సో ఇవన్నీ సలార్ పై అంచనాలు, ఆసక్తి పెరిగేలా చేస్తున్నాయి . ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ క్రేజీ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

Interesting news on Prabhas Salaar movie:

Prabhas sensation in a valley in Salaar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ