బాహుబలి లాంటి కళాఖండాన్ని సృష్టించిన రాజమౌళి ఆ తర్వాత బాహుబలిని మించిన కథతో వస్తారనుకుంటే.. ఆర్ ఆర్ ఆర్ అంటూ స్టార్ హీరోలని అడ్డం పెట్టి సినిమా తీసేసి హిట్ కొట్టేసారు. బాహుబలి లో అద్భుతమైన కథని చూపించిన జక్కన్న ఆర్ ఆర్ ఆర్ లో జస్ట్ హీరోల ఎలివేషన్స్ తోనే సరిపెట్టేసారు. ఆర్ ఆర్ ఆర్ లో కథే లేదు అంటూ చాలామంది విమర్శించారు. అయినా ఆర్ ఆర్ ఆర్ కలెక్షన్స్ ముందు ఈ కథ అనేది మరుగున పడిపోయింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ, ప్రమోషన్స్ తోనే పడేసిన జక్కన్నకి ఈసారి గట్టి కథ కావాలి.
కథ లేకుండా మహేష్ తో సినిమా అంటే మాములు విషయం కాదు. అందులోను ఇప్పుడు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ తో మరో అస్త్రాన్ని సంధిస్తున్నారు. కెజిఎఫ్ చాప్టర్ 2 అంటూ రాజమౌళికి పోటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. సలార్ తో ప్రభాస్ కటౌట్ కి సరిపోయే కథతో, మాస్ ఎలివేషన్స్ తో హిట్ కొట్టడం ఖాయమనే మాట వినిపిస్తుంది. మరి రాజమౌళి మహేష్ ని ఎంతగా ఎలివేట్ చేసినా అవ్వదు. సో కథ మీదే డిపెండ్ అవ్వాలి.. అందుకే ఈసారి గట్టి కథ కావాలి జక్కన్నా అంటూ రాజమౌళికి రిక్వెస్ట్ పెడుతున్నారు మహేష్ ఫాన్స్. మరి రాజమౌళి మహేష్ కథని ఎన్నాళ్ళు చెక్కుతారో.. విజయేంద్ర ప్రసాద్ జక్కన్నతో కథని ఎలా ఫైనల్ చేయిస్తారో చూద్దాం.