రాజమౌళి తో సినిమా చేసి భారీ హిట్ కొట్టి.. రిలాక్స్ అయ్యాక తదుపరి చిత్రం విషయంలో హీరోల టెంక్షన్ మాములుగా ఉండదు. ఎందుకంటే రాజమౌళి సినిమా తర్వాత ఎలాంటి దర్శకుడితో సినిమా చేసినా అది ఫట్ అవడం ఖాయమనే మాట రాజమౌళి ఫస్ట్ సినిమా నుండి నిన్నటి బాహుబలి వరకు కనిపించింది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ లోను అదే ఆందోళన, ట్రిపుల్ ఆర్ తో ప్రపంచమే మెచ్చే హిట్ కొట్టి కూల్ అయిన ఈ హీరోల తదుపరి సినిమాల విషయంలో చాలామంది ఫాన్స్ మదనపడుతున్నారు. అటు చిరు ఎంతగా ఆచార్య హిట్.. రాజమౌళి తర్వాత సినిమా కూడా చరణ్ హిట్ కొడతాడని బల్ల గుద్ది చెబుతున్నా చరణ్ ఫాన్స్ లో భయం తొలగడం లేదు.
ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే.. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తర్వాత చరణ్ కొరటాల సినిమాని ఆడియన్స్ ముందుకు తెస్తుంటే.. మరో హీరో ఎన్టీఆర్ కూడా కొరటాలతోనే ట్రిపుల్ ఆర్ తర్వాత సినిమా చెయ్యడం. అంటే ఇక్కడ హీరోలకన్నా ఒత్తిడి కొరటాలకు ఉండాలి. ఇప్పుడు చరణ్ కి ఆచార్య తో హిట్ ఇవ్వాలి. అటు ఎన్టీఆర్ కి NTR30 తో హిట్ ఇవ్వాలి. అంటే అటు చరణ్ ఆచార్య తో హిట్ కొట్టాలి లేదంటే.. రాజమౌళి నెక్స్ట్ సెంటిమెంట్ కి చరణ్ కన్నా ముందుగా కొరటాల ఇరుకుంటున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా పై ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. సో అలా కొరటాల చరణ్, ఎన్టీఆర్ కి ఇప్పుడు కంపల్సరీ హిట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.