అసలైతే ఆచార్య సినిమా ని రామ్ చరణ్ తో చెయ్యాలనే ప్లాన్ లో కొరటాల ఉండి.. ఆ స్టోరీ తో మెగాస్టార్ ఇంటికి వెళ్లగా.. అక్కడ చరణ్, చిరు కొరటాలతో డిస్కర్స్ చేస్తున్నప్పుడు రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ తో లాక్ అయ్యాడు. రాజమౌళి ఒన్స్ హీరో తన కాంపౌండ్ లోకి వచ్చాక గేట్ కి లాక్ చేసేస్తారు. అందుకే కొరటాల ని ఆచార్య కథతో నేను చేస్తే ఎలా ఉంటుంది అనగానే కొరటాల సంబ్రమాశ్చర్యాలతో సర్ అంటూ.. ఆచార్య కథని మార్పులు చేర్పులు చేస్తావా అనగానే కొద్దిగా టైం ఇవ్వండి బాస్ మీ కోసం వెంటనే చేంజ్ చేస్తా అని చెప్పడం, చరణ్ ఆర్ ఆర్ ఆర్ కి వెళ్ళిపోయాడు.. కూల్ గా మేము మా ఆచార్య చేస్తున్నాం. మళ్ళీ కొరటాల ఆచార్య కథలో మరో కీలక పాత్ర ఉంది. అది చరణ్ తో చేయిస్తే బావుంటుంది అనగానే మళ్ళీ కథ మొదటికి వచ్చింది.
ఆ కేరెక్టర్ చరణ్ తో చేపించడం కోసం రాజమౌళి ని అడగాలని ఫోన్ చెయ్యగా.. రాజమౌళి అస్సలు మా ఫోన్ ఎత్తలేదు. ఎందుకంటే చరణ్ ని అడుగుతామని రాజమౌళికి ముందే తెలుసు. ఇక పని జరగదని భావించి ఆడవారి సెంటిమెంట్ వాడాను, చరణ్ నేను కలిసి నటిస్తే సురేఖకి చూడాలని ఉంది అని. దానితో రాజమౌళి తన హీరో చరణ్ ని మధ్యలో ఆచార్య కోసం పంపారు. అసలైతే రాజమౌళి తన హీరోలని లాక్ చేసాక బయటికి పంపడం జరగదు. ఇక చరణ్ ని ఎప్పుడు పంపితే అప్పుడే ఆచార్య షూట్ చేసుకున్నాం. చరణ్ కోసం కొరటాల వెయిట్ చేసారు. ఇక చిన్న పాత్ర అనుకున్న చరణ్ ది అలా అలా పెరిగిపోయింది అంటూ చరణ్ ఆచార్య ఎందుకు ఎలా మిస్ అయ్యాడో చిరు గత రాత్రి జరిగిన ఆచార్య ఈవెంట్ లో రివీల్ చేసారు.