Advertisementt

హీరోల సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాం

Sun 24th Apr 2022 10:11 AM
acharya,acharya pre release event,chiranjeevi,ram charan,rajamouli  హీరోల సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాం
We will break that sentiment హీరోల సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాం
Advertisement
Ads by CJ

రాజమౌళి తో సినిమాలు చేసిన హీరోలకి ఓ సెంటిమెంట్ ఉంది. రాజమౌళి తో సినిమా చేసి భారీ హిట్ కొట్టాక వారికి ఆ నెక్స్ట్ సినిమాలు భారీ షాక్ ఇవ్వడమే కాదు.. డిజాస్టర్స్ అవ్వడం ఖాయమనే టాక్ ఉంది. టాక్ అని కాదు.. నిజంగానే రాజమౌళి తో సినిమా చేసిన హీరోలు తమ తదుపరి సినిమాలతో ప్రేక్షకులని మెప్పించలేకపోతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, రవి తేజ, నితిన్ ఆఖరికి సునీల్ కూడా రాజమౌళి నెక్స్ట్ ప్లాప్ సెంటిమెంట్ కి బలైనవాళ్ళే. బాహుబలి తర్వాత ప్రభాస్ కి రెండు ప్లాప్స్ పడ్డాయి. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ - రామ్ చరణ్ కూడా ఆ సెంటిమెంట్ కి బలవ్వాల్సిందే అంటూ మెగా ఫాన్స్ అటు ఎన్టీఆర్ ఫాన్స్ లో ఆందోళన ఉంది. మరవన్నీ చిరు దృష్టికి కూడా వచ్చాయనుకుంటా..

అందుకే ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. రాజమౌళి తో సినిమాలు చేసి హిట్ అందుకున్నాక తదుపరి సినిమాలు అంతటి హిట్ అందుకోవనే నానుడి ఉంది. కానీ ఆచార్య మాత్రం ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ హిట్ అవడం ఖాయమంటున్నారు. రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ తో భారీ హిట్ కొట్టాడు. అంటే ఆచార్య ప్లాప్ అవుతుంది అనే టాక్ తో చిరు అలా స్పందించారన్నమాట. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ హిట్.. అలాగే వెంటనే రాబోతున్న మా ఆచార్య కూడా హిట్ ఇది ఫిక్స్ అంటూ అంటూ చిరు రాజమౌళి నెక్స్ట్ మూవీ సెంటిమెంట్ ని బ్రేక్ చెయ్యడం పక్కా అంటూ మెగా ఫాన్స్ కి భరోసా ఇచ్చేసారు.

We will break that sentiment:

Acharya Pre Release Event highlights 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ