ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో జరగబోయే ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఇప్పటికే మెగా ఫాన్స్ ఆ ఏరియా కి చేరుకొని నానా హడావిడి చేస్తున్నారు. అలాగే ఆ రోడ్ లో వెళ్లాల్సిన ట్రాఫిక్ ని కూడా పోలీస్ లు మరో మార్గం ద్వారా దారి మళ్లించారు. అయితే ఈ ఈవెంట్ పై ఈ ఈవెంట్ కి హాజరు కాబోయే గెస్ట్ ల పై మెగా ఫాన్స్ చాలా ఆతృతగా ఉన్నారు. ఇప్పటికైతే చిరు, రామ్ చరణ్, రాజమౌళి తప్ప మరో పేరు బయటికిరాలేదు.
కానీ కొరటాల మహేష్ ని ఈ ఈవెంట్ కి ఇన్వైట్ చేసినట్టుగా ప్రచారం జరిగింది. అంటే మహేష్ ఆచార్య ఈవెంట్ లో చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారనే టాక్ నడిచినా ఆ విషయమై క్లారిటీ లేదు. మరోపక్క పవన్ కళ్యాణ్ వస్తున్నారని అన్నా.. ఆయన ప్రస్తుతం ఏలూరు జిల్లా పర్యటనలో రైతు ఓదార్పు యాత్రలో ఉన్నారు. సో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రాజమౌళి తప్ప మరొకరు రాకపోవచ్చు.. లేదంటే యూనిట్ ఈపాటికే పోస్టర్స్ తో సహా అధికారికంగా గెస్ట్ ల వివరాలు ప్రకటించేసేది. ఇక ఈ ఈవెంట్ లో చిరు ఏపీ సీఎం జగన్ గురించి ఏం మాట్లాడతారో.. ఎలాంటి థాంక్స్ లు చెబుతారో అనే విషయంపై కూడా అందరిలో ఆసక్తి మొదలయ్యింది.