రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ -రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ విడుదలై ఇప్పటికి నాలుగు వారాలు గడిచిపోయింది. మరొక్క రెండు రోజుల్లో నెల రోజులు పూర్తవుతుంది. మార్చ్ 25 న రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ అన్ని భాషల్లోనూ విజయ ఢంకా మోగించింది. ట్రిపుల్ ఆర్ కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి కాసుల వర్షం కురిపించింది. ఇక ఏప్రిల్ 14 కెజిఎఫ్ చాప్టర్2 రావడంతో ట్రిపుల్ ఆర్ హవా కొద్దిగా తగ్గినా.. ఇంకా ఇంకా థియేటర్స్ లో ఎంతో కొంత కలెక్షన్స్ తెస్తూనే ఉంది. అందుకేనేమో ట్రిపుల్ ఆర్ ఓటిటీపై ఇంకా మేకర్స్ ఓ డేట్ ని ఇవ్వడం లేదు.
అసలైతే ఈ మధ్యన నెల రోజులకే ఏ సినిమా అయినా ఓటిటిలోకి వచ్చేస్తుంది. బ్లాక్ బస్టర్ అయితే నెల, ప్లాప్ అయితే 15 రోజులకే ఓటిటి బాట పడుతున్న తరుణంలో ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యి నెల గడిచినా.. ఇంకా ఓటిటి డేట్ లాక్ చెయ్యలేదు. అది ఎప్పుడో కూడా చెప్పకుండా ఇంకా ఇంకా సస్పెన్స్ మాయింటింగ్ చేస్తున్నారు. అయితే ట్రిపుల్ ఆర్ కి ఇంకా ఓటిటిటి డేట్ లాక్ చేయకపోవడానికి కారణం హిందీతోపాటు ఇంగ్లీష్, కొరియన్, పోర్చుగీస్, టర్కీష్, స్పానిష్ భాషల్లో కూడా ట్రిపుల్ స్ట్రీమింగ్ కానున్నది ని.. ఫారిన్ వెర్షన్లను కూడా Netflix ప్రసారం చేయడం వలన ఓటిటి డేట్ ఇంకాస్త లేట్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే మే 25 కానీ, జూన్ ఫస్ట్ వీక్ లో కానీ ట్రిపుల్ ఓటిటి ద్వారా అందుబాటులోకి రావొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.