రాఖీ భాయ్ గా కెజిఎఫ్ చాప్టర్ లో శత్రువులని చీల్చి చెండాడడం కాదు.. ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీసు మీద యశ్ చేసిన దాడికి మిగతా భాషల హీరోలు విలవిలలాడుతున్నారు. హిందీ ఆడియన్స్ కెజిఎఫ్ చాప్టర్ కి ఇచ్చిన కలెక్షన్స్ కి నార్త్ హీరోలే షేక్ అవుతున్నారు. అంతలాంటి రెస్పాన్స్ తో కెజిఎఫ్ చాప్టర్ 2 బాక్సాఫీసుపై దాడి చేసింది. కెజిఎఫ్, కెజిఎఫ్ చాప్టర్ 2 లో హీరోయిన్ తో రాఖీ భాయ్ పెద్దగా రొమాన్స్ అయితే చెయ్యలేదు. ఏదో హీరోయిన్ ఉండాలి కాబట్టి శ్రీనిధి శెట్టి ని పెట్టారు కానీ.. లేదంటే లేదు.
అయితే తాజాగా రాఖి భాయ్ యశ్ తనకి ఇష్టమైన హీరోయిన్ ఒకరున్నారంటున్నాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకి ఇష్టమైన హీరోయిన్ బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకొనె అంటూ చెప్పిన యశ్.. దీపికా నటించిన సినిమాలు అన్ని చూస్తాను అని, ఆమె పెరఫార్మెన్స్ చాలా బావుంటుంది అని, అలాగే దీపికా తో కలిసి నటించాలనే కోరికని బయటపెట్టాడు ఈ రౌడీ రాఖీ భాయ్. మరి పాన్ ఇండియా స్టార్ అయిన యశ్ తో దీపికా అతి త్వరలోనే నటించే అవకాశం రావాలని కోరుకుందాం.