Advertisementt

కూతురి పుట్టిన రోజు, జీవిత రాజశేఖర్ కి షాక్

Fri 22nd Apr 2022 04:47 PM
joster films,jeevitha,rajasekhar,jeevitha rajasekhar,sivatmika birthday  కూతురి పుట్టిన రోజు, జీవిత రాజశేఖర్ కి షాక్
Case registered against Rajasekhar and Jeevitha కూతురి పుట్టిన రోజు, జీవిత రాజశేఖర్ కి షాక్
Advertisement
Ads by CJ

జీవిత రాజశేఖర్ దంపతులు ఇప్పుడు శేఖర్ మూవీ రిలీజ్ టెంక్షన్ లో ఉన్నారు. అలాగే ఈరోజు జీవిత రాజశేఖర్ కూతురు శివాత్మిక పుట్టిన రోజు. దానితో ఆమె నటిస్తున్న సినిమాల నుండి శివాత్మికకి స్పెషల్ బర్త్ డే గ్రీటింగ్స్ అందడంతో అందరూ హ్యాపీ గా ఉన్న టైం లో జీవిత రాజశేఖర్ కి బిగ్ షాక్ తగిలింది. నగరిలో జీవిత రాజశేఖర్ పై కేసు నమోదు అయ్యింది. తమ దగ్గర డబ్బు తీసుకుని ఎగ్గొట్టారంటూ జోస్టర్ ఫిలిమ్స్ అధినేత జీవిత రాజశేఖర్ పై కేసు పెట్టారు. అంతేకాకుండా త్వరలోనే రాజ శేఖర్ జైలుకి వెళతారంటూ సంచలనంగా మాట్లాడారు. 

గరుడ వేగ సమయంలో తాము ఆస్తులని తాకట్టు పెట్టి 26 కోట్లు అప్పు ఇచ్చామని, కానీ మా అప్పు ఎగ్గొట్టే ప్రయత్నాలు చేసారని, ఇప్పటికీ జీవిత రాజశేఖర్ పై చెక్ బౌన్స్ కేసు నడుస్తుంది అని, కానీ జీవిత రాజశేఖర్ లు తమ ఆస్తులని బినామీల పేర్ల మీదకి మార్చేసుకుని.. తమని మోసం చేసారంటూ జోస్టర్ ఫిలిమ్స్ వారు కేసు పెట్టిన విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ కేసు విషయమై జీవిత రాజశేఖర్లు స్పందించాల్సి ఉంది. కూతురి పుట్టిన రోజు నాడే తమపై ఇలాంటి కేసు నమోదు కావడం పై వారు ఎలా స్పందింస్తారో చూడాలి.

Case registered against Rajasekhar and Jeevitha:

Joster Films filed a case against Jeevitha Rajasekhar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ