అల్లు అర్జున్ ఏప్రిల్ 8 న తన 40 వ పుట్టిన రోజుని చాలా ఘనంగా చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత తన ఫ్యామిలీతో అల్లు అర్జున్ వెకేషన్స్ కి వెళ్లిపోయి ఈమధ్యనే హైదరాబాద్ కి తిరిగి వచ్చారు. పుష్ప తో పాన్ ఇండియా హిట్ కొట్టి.. ఓ రేంజ్ సెట్ చేసిన అల్లు అర్జున్.. తన 40 వ పుట్టిన రోజు వేడుకల విషయాన్ని ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ తో కలిసి ఎలా ఎంజాయ్ చేసారో అనే విషయాన్నీ అల్లు అర్జున్ ఫ్రెండ్ నవదీప్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు.
అల్లు అర్జున్ 40 వ బర్త్ డే ఎప్పటికి గుర్తుండిపోయేలా 40 మంది బెస్ట్ ఫ్రెండ్స్ తో విదేశాల్లో ఘనంగా చేసుకున్నారు. ఆ పార్టీకి స్నేహ రెడ్డి ఆరెంజ్ చేసింది. ఆ విషయాన్ని చెబుతూ నవదీప్ ట్వీట్ చేసాడు. 40 మంది బెస్ట్ ఫ్రెండ్స్ తో.. 40 వ బర్త్ డే వేడుకలు, చాలా తక్కువ టైం లో ఈ ట్రిప్ ఎప్పటికి గుర్తుండిపోతుంది. అల్లు అర్జున్ వైఫ్ స్నేహ రెడ్డి చాలా బాగా ప్లాన్ చేసారు.. మరోసారి హ్యాపీ బర్త్ డే బావా అంటూ నవదీప్ పిక్స్ ని పోస్ట్ చేసాడు.