ఆచార్య దమ్మున్న సినిమా ఈ మాట అన్నది ఎవరో కాదు, నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను. నైజాం అనగానే గుర్తొచ్చే పేరు దిల్ రాజు. కానీ దిల్ రాజు ని తప్పించి ఆచార్య నైజాం రైట్స్ వరంగల్ శ్రీను కి ఇచ్చారు మేకర్స్. ఆచార్య నైజాం డీల్ ఎప్పుడో పూర్తయ్యింది. దిల్ రాజుకి వరంగల్ శ్రీను కి మధ్యన నైజాం హక్కుల కోసం చాలా పోటీ నడిచింది. కానీ వరంగల్ శ్రీను తగ్గలేదు. దానితో 42 కోట్లకి నైజాం రైట్స్ వరంగల్ శ్రీను ఖాతాలోకి వెళ్లాయి. అయితే రీసెంట్ గానే వరంగల్ శ్రీను మాట్లాడుతూ ఆచార్య చూస్తూ ఫాన్స్ రచ్చ చెయ్యడం ఖాయమని, ఆచార్య దమ్మున్న సినిమా అని చెబుతున్నాడు.
ఆచార్యలో మంచి కథ ఉంది. మెగా ఫాన్స్ చిరు, చరణ్ లో ఏవైతే కోరుకుంటారో అవన్నీ ఈ చిత్రంలో కనిపిస్తాయి. అసలు నేను చిరంజీవి గారిని చూసే ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆయన్ని చూసే ఏదైనా సాధించాలని వచ్చా. చిరంజీవి గారి సినిమాని నేను ఎప్పుడెప్పుడు ప్రొడ్యూస్ చేయాలా అని ఎదురుచూస్తున్నా. ప్రొడ్యూసర్ గా కాకపోయినా ఆయన సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసే ఛాన్స్ ఆచార్యతో వచ్చింది. ఈ సినిమా నాకు రాకుండా చేయడానికి చాలామంది ట్రై చేసారు. కానీ నేను మాత్రం వెనకడుగు వెయ్యలేదు. ఆచార్య కొనాలనుకున్న కొనేసాను.. ఈ సినిమాని 42 కోట్ల కి కొన్నా.. మరో 2 కోట్లు ఖర్చులుంటాయంటూ వరంగల్ శ్రీను ఆచార్య గురించి చెప్పుకొచ్చాడు.