కొరటాల శివ మెగాస్టార్ ని ఆచార్య గా చూపించడానికి టైం దగ్గరకొచ్చేసింది. రామ్ చరణ్ - చిరు స్క్రీన్ మీద ఫాన్స్ కి కిక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఆచార్య ప్రమోషన్స్ ని ఇంటర్వూస్ తో స్టార్ట్ చేసారు. రేపు 23 న హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ ఎత్తున ప్లాన్ చేసారు మేకర్స్. ఈ ఈవెంట్ కి రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ చీఫ్ గెస్ట్ లుగా రాబోతున్నారు. ఇప్పుడు ఆచార్య సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఆచార్య కి యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు.
అలాగే ఆచార్య రన్ టైం 2 గంటల 34 నిమిషాలుగా లాక్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఆచార్య సినిమా కి సెన్సార్ టాక్ ఎలా ఉంది అంటే.. ఆచార్య ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉంది అని, సెకండ్ హాఫ్ ఎక్సట్రార్డినరీ అని, అలాగే చిరు - రామ్ చరణ్ కాంబో సీన్స్ అదిరిపోయాయని, ఫాన్స్ కి ఫుల్ మీల్స్ అని.. అలాగే కొరటాల శివ సినిమాల్లో క్లైమాక్స్ వీక్ ఉంటుంది అనే కంప్లైంట్ ఉంది. కాని ఆచార్య తో ఆ కంప్లైంట్ ని బ్రేక్ చెయ్యబోతున్నాడు కొరటాల. ఆచార్య లో క్లైమాక్స్ ని ఎక్సట్రార్డినరీగా ఓ రేంజ్ లో డిజైన్ చేసారని సెన్సార్ టాక్ చెబుతుంది.