మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా మరో వారం రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ కొరటాల శివ ఈ సినిమాని తెరకెక్కించారు. రామ్ చరణ్ కూడా చిరు తో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో తాండవం చేస్తున్నాయి. మరో పక్క మహేష్ బాబు ఆచార్య కి వాయిస్ ఓవర్ ఇచ్చారని తెలియగానే మహేష్ ఫాన్స్ కూడా ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఏప్రిల్ 23 న హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీగా ప్లాన్ చేసారు మేకర్స్.
అయితే ఆచార్య ఈవెంట్ కి ఎస్ ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. ట్రిపుల్ ఆర్ సక్సెస్ తర్వాత ఫస్ట్ టైం రాజమౌళి పబ్లిక్ అప్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. అదలా ఉంటే ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మరో సర్ ప్రైజ్ గెస్ట్ కూడా ఉండబోతున్నారు అని తెలుస్తుంది. ఆయనే సూపర్ స్టార్ మహేష్ బాబు. అటు మెగా హీరోలైన చిరు, చరణ్ కి మహేష్ క్లోజ్, అలాగే కొరటాల శివ కి మహేష్ కి ఉన్న అనుబంధంతో మహేష్ ఈ ఈవెంట్ కి వస్తున్నారని తెలుస్తుంది. మరి మహేష్ - చిరు - రామ్ చరణ్ ఒకే స్టేజ్ పై కనిపిస్తే ఫాన్స్ కి పూనకాలే. సో మెగా ఫాన్స్ తో పాటుగా ఘట్టమనేని ఫాన్స్ కూడా ఆచార్య ఈవెంట్ ని ఎంజాయ్ చెయ్యడానికి రెడీ అయ్యిపోవాల్సిందే.