Advertisementt

వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సమంత

Thu 21st Apr 2022 06:33 PM
samantha,thailand,samantha holidaying in thailand,yashoda movie,shakunthalam  వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సమంత
Samantha holidaying in Thailand వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సమంత
Advertisement
Ads by CJ

సమంత ఇప్పుడు నాగ చైతన్యతో విడాకులు తీసుకుని గతం గతః అన్నట్టుగా కెరీర్ లో చెలరేగిపోతుంది. శాకుంతలం డబ్బింగ్ పూర్తి చేసిందో లేదో.. యశోద మరొక షెడ్యూల్ కంప్లీట్ చేసేసింది. అంతేకాకుండా సమంత - విజయ్ దేవరకొండ - శివ నిర్వాణ కలయికలో తెరకెక్కుతున్న మూవీ ఈ రోజు అఫీషియల్ గా మొదలైంది. ఈ సినిమా కాశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూల్ మొదలు పెట్టుకోబోతుంది. సమంత - విజయ్ దేవరకొండ కలయికలో రెగ్యులర్ షూట్ ఈ నెలలోనే మొదలు కాబోతుంది. ఈ సినిమాలో సమంత కాశ్మీరీ గర్ల్ గా కనిపించబోతుంది.

అయితే ఈ లోపులో సమంత ఓ చిన్న వెకేషన్స్ కి ప్లాన్ చేసుకుని ఫ్లైట్ ఎక్కేసింది. అదేదో మాల్దీవులకు వెళ్ళలేదు. సమంత ఈసారి థాయిలాండ్ వెకేషన్స్ కి జంప్ అయ్యింది. అక్కడ ఇష్టమైన ఫుడ్ తింటూ సమంత ఎంజాయ్ చేస్తున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి వెకేషన్స్ లో ఫుడ్ ని ఎంజాయ్ చేసినా మళ్ళీ జిమ్ లో బరువులు ఎత్తుతూ వర్కౌట్స్ చేస్తూ కొవ్వుని ఇట్టే కరించేసే కెపాసిటీ సమంత దగ్గర ఉంది. ఇక హాలీవుడ్ మూవీ ఒకటి, బాలీవుడ్ మూవీలలో నటిస్తున్న సమంత కి అక్షయ్ కుమార్ జోడిగా ఓ సినిమా తగిలింది అనే న్యూస్ నడుస్తున్నా.. అది ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. 

Samantha holidaying in Thailand:

Samantha holidaying in Thailand pic goes viral 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ