Advertisementt

యశ్ నెక్ట్ పై ఫాన్స్ వెయిటింగ్

Thu 21st Apr 2022 05:43 PM
yash,kannada hero,kgf hero,yash fans,prashanth neel  యశ్ నెక్ట్ పై ఫాన్స్ వెయిటింగ్
Fans waiting on Yash Next యశ్ నెక్ట్ పై ఫాన్స్ వెయిటింగ్
Advertisement
Ads by CJ

కన్నడలో ఓ సీరియల్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని మొదలు పెట్టి ఈ రోజు పాన్ ఇండియా మార్కెట్ నే కొల్లగొట్టే స్టేజ్ కి వచ్చాడు యశ్. తన తండ్రితో సినిమాల్లోకి చేరతా అంటే మూడు వందల రూపాయలు ఇచ్చాడని.. తర్వాత ఎన్నో కష్టాలు ఓర్చి సినిమాలో హీరోగా నిలబడ్డాను అని చెప్పిన యశ్ పేరు ఇప్పుడు ప్రపంచం మొత్తం మార్మోగిపోతుంది. రాఖి భాయ్ గా ఓ బెంచ్ మార్క్ ని కెజిఎఫ్ చాప్టర్ 2 తో సెట్ చేసాడు యశ్. కెజిఎఫ్ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి రాఖీభాయ్ ఎంతమంది శత్రువులని మట్టు బెట్టాడో అనే దానికన్నా యశ్ ఎలివేషన్ ఆయన ఫాన్స్ కే కాదు.. ఇతర భాషల ఆడియన్స్ కి కూడా గూస్ బంప్స్ వచ్చేలా ఉండడంతో చాప్టర్ 2 పై అంచనాలు పెరిగిపోయాయి. 

ఆ అంచనాలు అందుకోవడం యశ్ మరోసారి సక్సెస్ అయ్యాడు. అంతటి హీరోయిజాన్ని యశ్ నుండి ప్రశాంత్ నీల్ బయటికి తీశారు. అయితే కెజిఎఫ్ చాప్టర్ 2 రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు యశ్ నెక్స్ట్ పై అందరిలో ఆత్రుత మొదలైంది. మరీ ముఖ్యంగా ఆయన ఫాన్స్ లో యశ్ చెయ్యబోయే నెక్స్ట్ ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటిలో ఉన్నారు. అటు చూస్తే సలార్ తో ప్రశాంత్ నీల్ బిజీగా మారారు. ఇటు చూస్తే నిర్మాతలు సుధా కొంగరతో సినిమా కమిట్ అయ్యి అఫీషియల్ ప్రకటన ఇవ్వగా.. ఇప్పుడు యశ్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు, ఎలాంటి జోనర్ ని ఎంచుకుంటాడో అనే ఆత్రుత ఫాన్స్ లో అంతకంతకు పెరిగిపోతుంది. 

Fans waiting on Yash Next:

Fans waiting on KGF Hero Yash Next Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ