Advertisementt

మొన్న అల్లు అర్జున్.. నేడు అక్షయ్

Thu 21st Apr 2022 01:48 PM
akshay kumar,tobacco brand,twitter,akshay fans  మొన్న అల్లు అర్జున్.. నేడు అక్షయ్
Akshay Kumar issues apology to fans మొన్న అల్లు అర్జున్.. నేడు అక్షయ్
Advertisement
Ads by CJ

స్టార్ హీరోలు అయినా, హీరోయిన్స్ అయినా అటు సినిమాల రూపంలోనే కాదు, ఇటు కొన్ని బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్లు కింద, యాడ్స్ రూపంలోనూ ఇలా రెండు చేతులా సంపాదిస్తున్నారు. టాలీవుడ్ లో మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, రీసెంట్ గా చిరు ఇలానే పలు బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఎవరి సంగతి ఎలా ఉన్నా.. ఈమధ్యన అల్లు అర్జున్ చేసిన యాడ్స్ కాంట్రవర్సీ అయ్యాయి. అందులో రాపిడో యాడ్ కి సీపీ సజ్జనార్ నోటీసు లు కూడా ఇచ్చారు. అలాగే జొమాటో యాడ్ కి అల్లు అర్జున్ ని నెటిజెన్స్ ట్రోల్ చేసారు. అందుకేనేమో అల్లు అర్జున్ ఇకపై పాన్ మసాలా యాడ్స్ లో నటించను అంటూ కోట్లు వదులుకున్నాడు.

ఇప్పుడు అక్షయ్ కుమార్ కూడా పాన్ మసాలా యాడ్ ని వదులుకుని మరీ ఫాన్స్ కి క్షమాపణలు చెప్పాడు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పాన్ మసాలా యాడ్లో నటించడంతో అతనిపై నెటిజెన్స్ ట్రోల్ చెయ్యడమే కాదు, అక్షయ్ ఫాన్స్ కూడా అతనిపై గుర్రుగా ఉన్నారు. ఆ యాడ్ లో నటించినందుకు గాను అక్షయ్ కి కోట్లు ముట్ట జెప్పింది సదరు కంపెనీ. అయితే తనపై వస్తున్న ట్రోల్స్ కి తల వంచిన అక్షయ్ కుమార్.. ఫాన్స్ కి, శ్రేయోభిలాషులకు క్షమాపణలు చెబుతూ నేను పొగాకును ఆమోదించను, ఆమోదించలేదు.. మీ ఎమోషన్స్ ని, మీ నుండి వస్తున్న స్పందన చూసాక నాకు బాధ వేసింది.. అందుకే మిమ్మల్ని గౌరవిస్తూ బ్రాండ్‌ అంబాసిడర్‌గా తప్పుకుంటున్నాను. ఆ యాడ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏదైనా మంచి పనికి ఉపయోగిస్తాను. కాకపోతే నేను చేసిన కాంట్రాక్ట్‌ నిబంధనల ప్రకారం కొంతకాలం వరకు ఆ ప్రకటన ప్రసారమవుతూనే ఉంటుంది.. ఇక మీదట ఇలాంటి యాడ్స్ లో నటించను అని ట్వీట్ చేసాడు.

Akshay Kumar issues apology to fans:

Akshay Kumar Says Sorry for Joining Tobacco Brand, Twitter Responds with Memes

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ