కొరటాల శివ మెగాస్టార్ చిరు తో ఆచార్య సినిమా స్క్రిప్ట్ రాసినప్పుడే ఆ సినిమాలో చిరు తో పాటుగా మహేష్ బాబు ని నటింపచేయాలని అనుకున్నారు. అప్పటికే కొరటాల శివ మహేష్ బాబు తో శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు చేసి ఉండడంతో.. చిరు తో మహేష్ స్క్రీన్ చేసుకోవడానికి కొరటాల ఒప్పించి ఉంటారనే టాక్ నడిచింది. తర్వాత ఓ ఇంటర్వ్యూలోనూ మహేష్ చిరు తో ఆచార్య సినిమాలో నటించాల్సి ఉంది... అయినా డేట్స్ అడ్జెస్ట్ కాకపోయేసరికి చెయ్యలేకపోయాను అని చెప్పాడు.
ఇక మహేష్ చెయ్యాల్సిన రోల్ లో చిరు కొడుకు రామ్ చరణ్ మెరిశారు. చిరు భార్య అడగడం, చిరు రాజమౌళిని ఒప్పించడంతో ఆచార్య సినిమాలో రామ్ చరణ్ నటించేసాడు. అది కూడా 30 నిమిషాల నిడివి గల పాత్రలో చరణ్ కనిపించబోతున్నాడు. అయితే చిరు తో స్క్రీన్ షేర్ చేసుకోవడం మిస్ అయినా.. ఇప్పుడు ఆచార్య సినిమాలో మహేష్ కూడా భాగమయ్యారు. అదెలా అంటే మహేష్ బాబు ఆచార్య సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారనే విషయాన్ని టీం రివీల్ చేసింది. మెగా హీరోలైన చిరు - రామ్ చరణ్ నటించిన ఆచార్య లో మహేష్ బాబు తన వాయిస్ ఓవర్ తో అలా భాగమయ్యారన్నమాట. కొరటాల కోరిక కూడా అలా తీరిపోయింది.