బిగ్ బాస్ నాన్ స్టాప్ లోకి టైటిల్ ఫెవరెట్ గా అడుగుపెట్టిన అఖిల్ కి మొదటి వారం నుండే హీరోయిన్ బిందు మాధవి గట్టి పోటీ ఇవ్వడం, మెల్లగా బిందు మాధవి టైటిల్ ఫెవరెట్ గాను మారిపోయింది. ఇక అఖిల్, బిందు మాధవి మొదటి వారం నుండి నామినేషన్స్ లోనూ పోటీ పడుతున్నారు. వారిద్దరి మధ్యన ప్రతి విషయంలో గొడవ జరిగినా అక్కడ కూడా బిందు మాధవినే హైలెట్ అవుతుంది. అలాగే ఓటింగ్ విషయంలోనూ బిందు మాధవికి ఎక్కువ ఓట్స్ తో అఖిల్ కి ప్రతి వారము షాకిచ్చుకుంటూ వచ్చింది. ఈ వారం కూడా బిందు, అఖిల్ నామినేట్ అయినా.. బాబా భాస్కర్ వలన బిందు మాధవి సేవ్ అయ్యింది.
ఇక ఈ వారం శివ కెప్టెన్ అవడం, బిందు మాధవి నామినేషన్స్ లో లేకపోవడంతో వారిద్దరి ఓట్స్ అనిల్ కి షేర్ అవుతున్నాయని తెలుస్తుంది. అంటే అఖిల్ కి మళ్ళీ షాకే. అలాగే ఈ వారం మిత్ర శర్మ కూడా నామినేషన్స్ లో లేదు. ఈ వారం నామినేషన్స్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన అఖిల్, ఆశు రెడ్డి, అనిల్, హమీద, అజయ్ లు ఉన్నారని.. ఓటింగ్ లో మొదటి స్థానంలో అనిల్, సెకండ్ ప్లేస్ లో అఖిల్ ఉండగా.. మూడో ప్లేస్ లో హమీద ఉన్నట్లుగా తెలుస్తుంది. తర్వాత స్థానాల్లో ఆశు రెడ్డి, అజయ్ లు ఉండగా ఈ వారం ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి షాక్ తగలడం ఖాయం అంటున్నారు.