Advertisementt

NTR30: అలియా ప్లేస్ లోకి లక్కీ హీరోయిన్?

Thu 21st Apr 2022 10:00 AM
ntr30,rashmika,alia bhatt,young tiger ntr,koratala shiva  NTR30: అలియా ప్లేస్ లోకి లక్కీ హీరోయిన్?
NTR30: Is she replacing Alia Bhatt? NTR30: అలియా ప్లేస్ లోకి లక్కీ హీరోయిన్?
Advertisement
Ads by CJ

గత కొన్ని రోజులుగా అలియా భట్ NTR30 లో ఎన్టీఆర్ తో కలిసి నటించేందుకు మొగ్గు చూపడం లేదని, ఆల్మోస్ట్ NTR30 నుండి అలియా భట్ తప్పుకుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కొరటాల శివ - ఎన్టీఆర్ కలయికలో జూన్ లో మొదలు కాబోతున్న NTR 30 లో అలియా భట్ ని హీరోయిన్ గా ఎంపిక చెయ్యడమే కాదు.. ఆమెని ఆహ్వానిస్తూ అఫీషియల్ గా ప్రకటన కూడా ఇచ్చారు. అయితే ట్రిపుల్ ఆర్ తో సౌత్ కి గ్రాండ్ ఎంట్రీ కాకపోయినా.. మంచి ఎంట్రీ ఇచ్చిన అలియా భట్ ఇప్పుడు సౌత్ దర్శకులపై నమ్మకం లేకపోవడం కారణంగానే ఎన్టీఆర్30 నుండి తప్పుకుంది అని..

కాదు అలియా భట్ ఈమధ్యనే పెళ్లి చేసుకుంది.. సో కొన్నాళ్ళు వ్యక్తిగత జీవితానికి షూటింగ్స్ అడ్డు కాకూడదనే అభిప్రాయంతోనే NTR 30 నుండి తప్పుకుంది అంటున్నారు. అయితే ఇప్పుడు అలియా భట్ ప్లేస్ లోకి లక్కీ హీరోయిన్ పేరు వినిపిస్తుంది. ఆమె రష్మిక మందన్న. పుష్ప తో పాన్ ఇండియా హిట్ కొట్టి, బాలీవుడ్ లోను పాగా వెయ్యడానికి ట్రై చేస్తున్న రష్మిక ఈమధ్యనే కోలీవుడ్ హీరో విజయ్ తో కలిసి నటించబోతుంది. ఇక లక్కీ హీరోయిన్ గా వరస సక్సెస్ లతో ఉన్న రష్మిక ని అలియా భట్ ప్లేస్ లోకి కొరటాల - ఎన్టీఆర్ పరిశీలిస్తున్నారనే టాక్ మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. 

NTR30: Is she replacing Alia Bhatt?:

NTR30: Rashmika to replace Alia?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ