ఆచార్య మరొక్క ఎనిమిదిరోజుల్లో విడుదల కాబోతున్న సినిమా. మెగాస్టార్ - రామ్ చరణ్ కలయికలో తెరకెక్కిన సినిమా కావడంతో సినిమాపై విపరీతమైన హైప్ ఉంది. ఆ హైప్, క్రేజ్ ఉంటే సరిపోతుందా.. ప్రమోషన్స్ అక్కర్లేదా.. ఇప్పుడు ఇదే అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఆచార్య సినిమా రిలీజ్ కి సమయం దగ్గర పడుతుంది.. కానీ ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు టీం. ఏదో స్పెషల్ ఇంటర్వూస్ అంటూ ఆచార్య దర్శకుడు కొరటాల, రామ్ చరణ్ ల ఇంటర్వ్యూ ని మీడియా కి ఇచ్చారు. కానీ మీడియా ముఖంగా ఇంతవరకు టీం మొత్తం ప్రెస్ మీట్ పెట్టింది లేదు.
ఏప్రిల్ 23 న జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాతే ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో చేద్దామని టీం ఫిక్స్ అయ్యుంటుంది. అందుకే ప్రస్తుతం కామ్ గా ఉంది అంటుంటే.. ఎంత పెద్ద సినిమా అయినా ఇప్పుడు ప్రమోషన్స్ చాలా ముఖ్యం. కరోనా పాండమిక్ సిట్యువేషన్, టికెట్ రేట్స్ అధికం ఇలాంటి వాటితో ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం తగ్గించారు. ప్రమోషన్స్ తో సినిమాపై అంచనాలు పెంచి క్రేజ్ క్రియేట్ చేస్తేనే ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించగలరు. లేదంటే సో సో ప్రమోషన్స్ తో ప్రేక్షకులు థియేటర్స్ కి రారు. మరి ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత రోజూ మీడియా తో ఇంటరాక్ట్ అవుతారేమో చూద్దాం.