గత కొన్నిరోజులుగా సౌత్ మూవీస్ హిందీ మర్కెట్ మీద దాడి చేస్తున్నాయి. హిందీ హీరోలకి చుక్కలు చూపిస్తున్నారు. వారంలోనే 100 కోట్లు, 200 కోట్లు, 250 కోట్లు అంటూ ఫిగర్ ని జెనెరేట్ చేస్తున్నాయి. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ మూవీ 200 కోట్లు కొల్లగొట్టేస్తే.. ఇప్పుడు కేజిఎఫ్ 2 వారం తిరక్కముందే 250 కోట్ల మార్క్ ని టచ్ చేసేసింది. కేజిఎఫ్ చాప్టర్2 రిలీజ్ అయిన ప్రతి భాషలో కోట్లు కొల్లగొట్టుపోతుంది. పాన్ ఇండియా మార్కెట్ లో అతి పెద్ద మార్కెట్ అయిన హిందీ మార్కెట్ లో రికార్డు కలెక్షన్స్ కొల్లగొట్టింది.
కేవలం ఆరు రోజుల్లో హిందీ లో 250 కోట్ల మార్కును టచ్ చేసింది. ఇంకా సెకండ్ వీకెండ్ పూర్తయ్యేసరికి 300 కోట్ల మార్కును అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నార్త్ ఇండియన్స్ యాక్షన్ మూవీస్ ని ఎంతగా ఆదరిస్తారో అనేది కేజిఎఫ్ 2 మరోసారి ప్రూవ్ చేసింది. యాష్ యాక్షన్, సంజయ్ దత్, రవీనా టాండన్ స్క్రీన్ ప్రెజెన్స్, ప్రశాంత్ నీల్ దర్శకత్వం అన్ని హిందీ ప్రేక్షకులకి నచ్చేయ్యడంతో కేజిఎఫ్ 2 ని విపరీతంగా ఆదరిస్తున్నారు. సో అలా రికార్డు కలెక్షన్స్ తో ఆ సినిమా ఓ బెంచ్ మార్క్ సెట్ చేసేలా కనబడుతుంది.