శ్యామ్ సింగ రాయ్ భారీ హిట్ తర్వాత ఆ లేవల్లోనే నాని దర్శకుడు వివేక్ ఆత్రేయతో కలిసి అంటే సుందరానికి అంటూ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ లో నటించాడు. షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసుకుని జూన్ 10 న విడుదలకు రెడీ అవుతున్న అంటే సుందరానికి ప్రమోషన్స్ కార్యక్రమాలు టీజర్ తో గ్రాండ్ గా మొదలు పెట్టింది టీం. వివేక్ ఆత్రేయ అంటే ఫుల్ కామెడీ ఉండే జోనర్ లోనే కథ ప్రిపేర్ చేసుకుంటాడు. ఇప్పుడు నాని కోసమూ అదే కామెడీకి ఇంపార్టెన్స్ ఇస్తూ, మధ్యలో లవ్ స్టోరీలో క్యాస్ట్ ట్విస్ట్ ఇచ్చాడు. సుందరం ఎంతోమంది అమ్మాయిల మధ్యన పుట్టిన ఒకే ఒక అబ్బాయి. అతని ఫ్యామిలీకి జాతకాల పిచ్చి. ఇక సుందరం సాఫ్ట్ వెర్ జాబ్ కి కూడా బ్రాహ్మణ పంచె కట్టులో హాజరవడంతో ఆ కంపెనీ ఎండి షాకవడమే కాదు.. ఏమిటి అవతారం అనగానే.. దానికి నాని చెప్పే ఫన్నీ డైలాగ్స్ నవ్వు తెప్పించేదిలా ఉంది.
ఇక ద్విచక్ర వాహనం గండం అంటూ డొక్కు స్కూటర్ ఇవ్వడం, హీరోయిన్ నజ్రియా క్రిష్టియన్ అయినప్పటికీ, సుందరం ఆమెని ఇష్టపడడంతో ఇరు ఫామిలీస్ షాకవడం.. తర్వాత కాస్త ఎమోషన్ అన్ని అంటే సుందరానికి కామెడీ పుట్టించేవిలా కనబడుతున్నాయి. ఇక టీజర్ లాస్ట్ లో హర్ష వర్ధన్ తో అంటే అని నాని అనగానే.. అంటే ఇంకా ఉందా అనగానే, నాని అంటే అంటూ నాన్చుతుండడం చూసి అంటే ఏమిటో చెప్పవయ్యా అంటూ ఆ సస్పెన్స్ తట్టుకోలేక ఆడియన్స్ కూడా అడిగేలా అంటే సుందరానికి టీజర్ కట్ చేసారు. నాని బ్రాహ్మణ లుక్, నజ్రియా మోడరన్ లుక్ హైలెట్ అనేలా ఉన్నాయి. ఇక ఈ సినిమాని కూడా నాని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు.