Advertisementt

బిగ్ బాస్: బాబా ని చూసి భయపడ్డారు

Wed 20th Apr 2022 10:39 AM
bigg boss,bigg boss telugu ott,ariyana glory,baba bhasker,akhil,bindu madhavi  బిగ్ బాస్: బాబా ని చూసి భయపడ్డారు
Bigg Boss Non Stop: Wild card contestant Baba Bhaskar బిగ్ బాస్: బాబా ని చూసి భయపడ్డారు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నాన్ స్టాప్ లోకి ఫస్ట్ వైల్డ్ కార్డు ఎంట్రీగా బాబా భాస్కర్ అడుగుపెట్టాడు. సీజన్ 3 లో బెస్ట్ ఎంటెర్టైనెర్ గా నిలిచిన బాబా భాస్కర్ ని మళ్ళీ భారీ పారితోషకంతో హౌస్ లోకి ఎంట్రీ ఇప్పించారు. హౌస్ మేట్స్ గొడవలు తప్ప అక్కడ ఎంటర్టైన్మెంట్ మిస్ అవడంతో బాబా భాస్కర్ ని మధ్యలో బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. అయితే బాబాని ఆదివారమే హౌస్ లోకి పంపినా.. సీక్రెట్ రూమ్ లో పెట్టి హౌస్ మేట్స్ ఆట తీరుని గమనించమని చెప్పి నామినేషన్స్ లోకి వచ్చిన ఆరుగురిలో ఒకరిని సేవ్ చెయ్యమనగానే.. బాబా భాస్కర్ బిందు మాధవిని సేవ్ చేసాడు. తర్వాత హౌస్ లోకి అపరిచితుడు అంటే గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ తో ఆటలాడించాడు. ఆ తర్వాత బాబా భాస్కర్ తనదైన స్టయిల్లో హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో హౌస్ మేట్స్ ఒక్కసారిగా షాకయ్యారు. 

ఈయనేమిట్రా బాబు బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చేసాడని భయపడ్డారు కూడా. ఆ తర్వాత బాబా భాస్కర్ అందరినీ లోపలికి పిలిచి.. నామినేట్ అవని వాళ్లంతా.. నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో ఒకరిని సెలెక్ట్ చేయమని చెప్పాడు. దీంతో ఆరియానా ఆయనతో గొడవకు దిగింది. ఇక నామినేట్ అవని వాళ్ళు అనిల్ పేరు చెప్పగా.. చివరికి బాబా బిందు, అజయ్ లు ఆట తీరు బావుంది అంటూ బిందు ని నామినేషన్స్ నుండి సేవ్ చెయ్యడంతో అఖిల్ అండ్ బ్యాచ్ కి షాక్ తగిలింది. అంటే బిందు మాధవి బయట స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ప్రాజెక్ట్ అయ్యి ఉంటుంది అందుకే బాబా భాస్కర్ ఆమెని సేవ్ చేసాడని వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.

Bigg Boss Non Stop: Wild card contestant Baba Bhaskar:

Bigg Boss Telugu OTT: Ariyana Glory loses her cool

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ