రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా ఫిలిం ట్రిపుల్ ఆర్ బ్లాక్ బస్టర్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ కొల్లగొడుతూ రికార్డులని సెట్ చేసింది. సినిమాలో ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్స్, రామ్ చరణ్ ఎలివేషన్స్ తప్ప కథ లేదు. అయినా హీరోయిజాన్ని హైలెట్ చేస్తూ రాజమౌళి అదిరిపోయే హిట్ కొట్టేసారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ అయితే పండగ చేసుకున్నారు. ఇక మరో పాన్ ఇండియా ఫిలిం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కెజిఎఫ్ 2 గా వచ్చింది. ఆ సినిమా పాన్ ఇండియా మార్కెట్ లో కలెక్షన్స్ కాసులు కురిపిస్తుంది. ఎక్కడ చూసినా కెజిఎఫ్ చాప్టర్2 మాటే. యశ్ హీరోయిజాన్ని, హీరో ఎలివేషన్స్ అన్ని యూత్ ని మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో ఆ సినిమా హిట్ అయ్యింది.
అయితే ఇక్కడ ట్రిపుల్ ఆర్, కెజిఎఫ్ చాప్టర్2 ఎలా ఉన్నాయి అని యూత్ ని అడిగితే వారు దిమ్మతిరిగే సమాధానం చెబుతున్నారు. అది ట్రిపుల్ ఆర్ కన్నా కెజిఎఫ్ 2 నే బావుంది. ఆ సినిమాలో యశ్ పెరఫార్మెన్సు, యశ్ ఎలివేషన్ అన్నీ ఫాన్స్ కి మాత్రమే కాదు, ఆడియన్స్ కి ఎక్కి, యూత్ కి బాగా నచ్చేసాయి. ప్రశాంత్ నీల్ ఏం తీసాడురా సినిమా, ఎన్టీఆర్, చరణ్ ట్రిపుల్ ఆర్ మూవీ ఏం సరిపోతుంది అంటూ జెన్యూన్ గా మాట్లాడుతున్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో చరణ్, ఎన్టీఆర్ ఫాన్స్ తప్పితే మిగతా వారికి ఆ సినిమా కన్నా కెజిఎఫ్ 2 నే నచ్చింది అనేది ఇప్పుడు యూత్ పోల్స్ చెబుతున్నాయి.