బాలీవుడ్ జంట పక్షులుగా తిరిగి మీడియాలో విపరీతంగా పాపులర్ అయిన టాప్ హీరోయిన్ అలియా భట్-రణబీర్ కపూర్ లు ఎట్టకేలకు ఈ నెలలో పెళ్లి పీటలెక్కారు. పెళ్లి చాలా సింపుల్ గా చేసుకుని ఒక్కటైనా ఈ జంట పెళ్లి తర్వాత ముంబై లోని తాజ్ హోటల్ లో గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చింది ఈ జంట. ఈ రిసెప్షన్ కి బాలీవుడ్ నుండి చాలామంది సెలబ్రిటీస్ హాజరయ్యారు కూడా. అయితే పెళ్లి చేసుకున్న జస్ట్ 4 డేస్ కే రణబీర్ కపూర్ తన వర్క్ లో మునిగిపోయారు. అలాగే అలియా భట్ కూడా ఐదు రోజుల్లోనే తన వర్క్ లో జాయిన్ అవడం హాట్ టాపిక్ అయ్యింది.
రణబీర్ కపూర్, ఇటు అలియా భట్ ఇద్దరూ పెళ్లి అయిన వారం లోపే తమ పనుల్లో బిజీ అయ్యారు. అంటే పెళ్లి తర్వాత హనీమూన్ అంటూ ఈ జంట ఏ విదేశాలకో ఎగిపోతుంది అనుకుంటే.. ఇలా షూటింగ్స్ లో బిజీ అవడం ఎవరికీ డైజెస్ట్ కావడం లేదు. ఓ వారం పది రోజుల పాటు కనబడదు అనుకున్న ఈ జంట పెళ్లి అయిన మూడు రోజులకే ఇలా బయటికొచ్చేసారు. ఏదైనా ముందు వర్క్.. తర్వాత ఎంజాయ్మెంట్ ఇది బావుంది.. కానీ అలియా భట్ ఫాన్స్ మాత్రం పెళ్లి అయ్యింది.. హనీమూన్ లేదా.. అలియా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.