Advertisementt

బీస్ట్ డైరెక్టర్ కి సూపర్ స్టార్ షాక్?

Tue 19th Apr 2022 07:39 PM
beast director,nelsen dilip kumar,rajinikanth,vijay  బీస్ట్ డైరెక్టర్ కి సూపర్ స్టార్ షాక్?
Unexpected shock to Beast director.. బీస్ట్ డైరెక్టర్ కి సూపర్ స్టార్ షాక్?
Advertisement
Ads by CJ

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో వరుణ్ డాక్టర్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ బీస్ట్ మూవీ తెరకెక్కించాడు. విజయ్ ఎలివేషన్ తప్ప కథ లేని బీస్ట్ ని విజయ్ ఫాన్స్ కూడా చూడలేకపోయారు. బీస్ట్ రిలీజ్ అయిన ఫస్ట్ షో కే ఆ సినిమా డిజాస్టర్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. అయినా విజయ్ స్టామినాతో ఆ సినిమా 100 కోట్ల మార్క్ కలెక్షన్స్ తో కళకళలాడింది తప్ప.. లేదంటే నిర్మాతలు నిండా మునిగిపోయేవారు. వరుణ్ డాక్టర్ లో డార్క్ కామెడీతో కడుపుబ్బా నవ్వించి నిర్మాతలకు లాభాల పంట పండిచిన నెల్సన్ విజయ్ బీస్ట్ కొచ్చేసరికి ఆ కామెడీ ని కూడా మిస్ ఫైర్ చేసేసాడు. ఇక బీస్ట్ రిలీజ్ కాకముందే నెల్సన్ కి సూపర్ స్టార్ రజినీకాంత్ ఆఫర్ ఇచ్చేసారు.

సూపర్ స్టార్ ఆఫర్ ఇవ్వడమే కాదు.. అధికారికంగా నెల్సన్ దిలీప్ కుమార్, రజినీకాంత్ కాంబో మూవీ ప్రకటించేసారు. కానీ ఇప్పుడు సూపర్ స్టార్ రజిని కూడా నెల్సన్ కి షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారని టాక్ కోలీవుడ్ మీడియాలో మొదలైంది. అంటే వరస ప్లాప్స్ లో ఉన్న రజినీకాంత్ కి ఇమ్మిడియట్ సక్సెస్ రావాలి. లేదంటే అయన మర్కెట్ మొత్తం పడిపోతుంది. రజినీకాంత్ గత కొన్నేళ్లుగా అంటే రోబో తర్వాత చేసిన సినిమాలేవీ ఆయనకి హిట్ ఇవ్వలేదు.. వరస ప్లాప్స్ లో ఉన్న ఆయన ఇప్పుడు ఈ డిసాస్టర్ డైరెక్టర్ తో సెట్స్ మీదకెళితే అటు సినిమాకి హైప్ ఉండదు, ఇటు ఆ డైరెక్టర్ పై ఉన్న నమ్మకం బీస్ట్ తో సన్నగిల్లింది సో.. సూపర్ స్టార్ మాత్రం నెల్సన్ దిలీప్ కుమార్ ప్లేస్ లోకి వేరే డైరెక్టర్ ని తెచ్చి నెల్సన్ కి షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారనే న్యూస్ గట్టిగానే వినిపిస్తుంది.

Unexpected shock to Beast director..:

Unexpected shock to Beast director.. Rajinikanth changed his mind 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ