మెగాస్టార్ చిరు ఈమధ్యన చేస్తున్న సినిమాలన్నీ మల్టీస్టారర్ చిత్రాలుగానే ప్రోజెక్ట్ అవుతున్నాయి. ఆచార్య లో రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు చిరు. ఆ తర్వాత గాడ్ ఫాదర్ కోసం ఏకంగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నే దింపారు. ఇక బాబీ తో చెయ్యబోయే వాల్తేరు శ్రీను కోసం రవి తేజ ని తీసుకొచ్చారు. ఈ సినిమాలో చిరు -రవితేజ అన్నదమ్ములుగా కనిపించబోతున్నారట. అలాగే భోళా శంకర్ లో చెల్లెలి కేరెక్టర్ కోసం స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ని ఎంపిక చేసుకున్నారు.
ఇక ఇప్పుడు చిరు - వెంకీ కుడుములు సినిమా కోసం ఆయన తన తమ్ముడు కొడుకు, హీరో వరుణ్ తేజ్ ని తీసుకురాబోతున్నట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. వరుణ్ తేజ్ తో చిరు కలిసి నటించేందుకు రెడీ అయ్యారని.. వరుణ్ కూడా పెదనాన్న చిరు మూవీ లో చెయ్యడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడని అంటుంటే.. చిరు ఏమిటి సోలో హీరోగా చెయ్యడానికి టెంక్షన్ పడుతున్నారా.. లేదా కథలు డిమాండ్ చెయ్యడం తో అలా సినిమాలు మల్టీస్టారర్ ల కింద మారుతున్నాయా అనే అనుమానాలు ఇప్పుడు అందరిలో మొదలైంది.