బాహుబలితో ప్రపంచం మొత్తం తెలుగు సినిమా పరిశ్రమవైపు చూసేలా చేసిన రాజమౌళి.. ఆర్ ఆర్ ఆర్ తో ఆ క్రేజ్ ని ఎల్లలు దాటించేసారు. అలాంటి రాజమౌళి కి స్పెషల్ కేటగిరి ఆడియన్స్ ఉన్నారు. హీరోలతో సమానమైన క్రేజ్ రాజమౌళికి కూడా ఉంది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో రంజాన్ స్పెషల్ నైట్స్ నడుస్తున్నాయి. అందులోను ఓల్డ్ బస్తి లో చార్మినార్ లైటింగ్స్ తో ధగధగా మెరిసిపోతుంది. అలాంటి ఓల్డ్ సిటీలో నైట్ బజార్ కి వెళ్లడానికి చాలామంది మొగ్గు చూపిస్తున్నారు. అలాగే రాజమౌళి కూడా నైట్ బజార్ ని విజిట్ చేసారు.
చార్మినార్ పరిసర ప్రాంతాలలో ఓ సాధారణ వ్యక్తిగా అర్ధరాత్రి రాజమౌళి తన కొడుకు కార్తికేయ తో నైట్ బజార్ మొత్తం తిరిగిన రాజమౌళి అక్కడ బిర్యానీ కూడా తిని వెళ్లిన చాలామంది ఆయన్ని గుర్తుపట్టలేదు. కాకపోతే రాజమౌళి కొడుకు కార్తికేయతో కలిసి బిర్యానీ తిని హోటల్ నుంచి వెళ్లే సమయంలో కొంతమంది ఆయన గడ్డం చూసి ఆయనను గుర్తుపట్టారు. ఇతను రాజమౌళి డైరెక్టర్ లాగా ఉన్నాడు అనుకుంటూ డైరెక్టర్ రాజమౌళి దగ్గరికి వెళ్లి సార్ మీరు రాజమౌళి గారు కదా సెల్ప్ఫీలు దిగడానికి పోటీ పడడడం హాట్ టాపిక్ అయ్యింది.