మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరస లైనప్ తో బిజీ బిజీగా వున్నారు. ఇక ఇప్పుడు చిరు ఆచార్య ప్రమోషన్స్ లోకి దిగబోతున్నారు. మరో పది రోజుల్లో ఆచార్య ఆడియన్స్ ముందుకు రాబోతుంది. తర్వాత మోహన్ రాజా గాడ్ ఫాదర్ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజి లో ఉండగా.. ఆతర్వాత భోళా శంకర్, బాబిలో Mega154 మూవీస్ కోసం చిరు రెడీ అవుతారు. అయితే బాబి సినిమాలో మరో హీరో రవి తేజ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. చిరు తో ఉన్న అనుబంధం కారణంగా రవితేజ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అయితే ఇప్పుడు Mega154 లో రవి తేజ రోల్ పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ సినిమాలో చిరంజీవి తమ్ముడిగా రవితేజ కనిపిస్తాడని.. ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ చనిపోతాడని.. అలా తమ్ముడి మరణం తరువాత చిరు పాత్రలో చాలా మార్పు వస్తుందని కూడా చెబుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో రవితేజ పాత్ర దాదాపు 40 నిమిషాల పాటు ఉంటుంది.. అలాగే Megas154 కోసం రవితేజ దాదాపు 20 రోజుల డేట్స్ కేటాయించడంతో ఆ న్యూస్ సారాంశం. ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటించబోతుంది. అయితే రవితేజ రోల్ పై వస్తున్న ఈ వార్తల్లో నిజమెంతుందో సినిమా రిలీజ్ అయ్యాక కానీ తెలియదు.